వనపర్తి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల వనపర్తి రాజకీయ చరిత్రలో ఎప్పు డూ లేని విష సంస్కృతికి తెరలేపుతున్నారు. గ తంలో ప్రజాప్రతినిధులుగా సారథ్యం వహించిన వారెవ్వరూ ఇలాంటి విధానానికి ఊతం ఇవ్వలేదు. అధికార పక్షమైనా.. ప్రతి పక్షమైనా ఇలాం టి ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. అభివృద్ధిలో పోటీ పడ్డారు.. తప్పి తే.. వివాదాలకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఇందుకు భి న్నంగా ఇప్పుడు వనపర్తిలో కొత్త పంథాను అవలంభిస్తుండడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లా కేంద్రంగా ఏర్పాటైన వనపర్తిలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నది బహిరంగ రహస్యం. నాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ.. తర్వాత వ్యవసాయ శాఖ మం త్రిగానూ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధిని కొత్త పుంతలు తొ క్కించారు. ఇప్పటికీ ఈ నిజాన్ని కాదనేవారు లేరు. నియోజకవర్గంలో మొదటి ఐదేండ్లు సాగునీటిని పరవళ్లు తొక్కిస్తే.. రెండో దఫాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. విద్యాపరంగా ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, గురుకుల వ్యవసాయ డిగ్రీ, మత్స్య కళాశాలలు, పాలనాపరమైన కొత్త భవనాలు, రోడ్ల విస్తరణలు, పార్కులు, సమీకృత మార్కెట్ యార్డులు, ట్యాంక్‌బండ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు లెక్కకుమించి చేశారు.
ఆనవాళ్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తీపి గుర్తులుగా కనిపిస్తున్నాయి. నిధులు మంజూరై శంకుస్థాపనలు చేసినవి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇంచుమించు వచ్చే ఐదేండ్ల కాలానికి సరిపడా పనులకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలోనే బీజాలు పడ్డాయి. అయితే, అభివృద్ధి పేరుతో వేసిన శిలాఫలకాలు తమకు కనిపించవద్దు అన్నట్లుగా కొన్ని అదృశ్య శక్తులు ధ్వంస రచనకు శ్రీకారం చుట్టాయి. ఈ పరిణామాలతో పట్టణంలోని విజ్ఞులు, మేధావులు ఎవరికివారు ఇదేం సంస్కృతి అంటూ ప్రశ్నించుకుంటున్నారు. విద్యకు అడ్డాగా పేరున్న వనపర్తిలో అభివృద్ధి కోసం వేసిన శిలఫలకాలను పగులుగొట్టి పైశాచిక అనందం పొందడం ఏమిటన్న చర్చకు తెరలేచింది. నాగవరం పరిధిలో రూ.22 కోట్లతో మంజూరైన ఐటీ టవర్, పాలిటెక్నిక్ కళాశాల బాలుర, బాలికల హాస్టళ్ల కోసం రూ.8 కోట్లతో వేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే పాన్‌గల్ రోడ్డులో వేసిన డ్రైనేజీ, రోడ్డు విస్తరణకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం పగులగొట్టి మోరీలో పడేశారు. ఇవన్నీ చూ స్తే.. కొత్త రాజకీయ వింతలను తలపిస్తున్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. జరిగిన అభివృద్ధిని, ఇంకా జరగాల్సిన పనులను శిలాఫలకాలను లేకుం డా చేస్తే.. ప్రజలు మరిచిపోతారా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారి శిలాఫలకాలను సైతం గౌరవించిన వనపర్తి గడ్డపై నేడు జరుగుతున్న విధ్వంసపు చర్యలతో ప్రజలు నివ్వెరపోతున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. ఉన్నంత కాలం ఎంత గొప్పగా పని చేశారన్నదే గుర్తుంటుందని పట్టణ ప్రజలే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. శిలాఫలకాలను ధ్వంసం చేయడంపై బీఆర్ఎస్ నాయకులు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కా కుండా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యా దవ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో సమస్య జఠిలమవుతోన్నది. ఇంతటితోనైనా శిలాఫలకాల ధ్వం సం ఆగుతుందా..? కొనసాగుతుందా..? అన్నది వేచి చూడాల్సిందే.
ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత ఆభివృద్ధిపై దృష్టి పెట్టాలి. 9 నెలలు గడిచినా అదే ఒరవడిని చూపించడం సరికాదు. నిలిచిన పనుల పూర్తి కోసం ప్రజలు కొండకు ఎదురు చూసినట్లు ఉన్నారు. ఇంకా మొదలెట్ట ని పనులను చేపట్టాలి. చేయాలనుకుంటే.. ఐ దేండ్లకు సరిపడా పనులున్నాయి. లేని కొత్త విష సం స్కృతిని తీసుకురావడం ఈ ప్రాం త అభివృద్ధికి గొడ్డలిపెట్టులాంటిది. జరిగిన అభివృద్ధిని చెరిపేయాలనుకోవడం అవివేకం తప్పా మరొకటి కా దు. శిలాఫలకాలను పగులగొట్టడం వంటివి వివాదాలకు దారితీస్తాయి తప్పా ఉపయోగం లేదు.