ధరూరు, జూన్ 9 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4.618 టీఎంసీలకు గా నూ 0.911 టీఎంసీలు నిల్వ ఉన్నది.
అయిజ, జూన్ 9 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆదివారం 7,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 7,952 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైనట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యాంకు ఆదివారం 2,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 8 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం 100.855 గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 4.168 టీఎంసీల నిల్వ ఉన్నది. 1633 అడుగులకు గా నూ 1,579.36 అడుగులకు చేరినట్లు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.