పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక సమరానికిగానూ రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఆశావహులు గ్రామాల్లో సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు కదనరంగంలోకి దిగి ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు జిల్లాలోని 1,692 గ్రామపంచాయతీలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు ఏ సమయంలో ప్రకటించినా నిర్వహణకు ఆయా జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పక్షాలు సైతం స్థానిక పోరుకు సై అంటున్నాయి.
గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం త్వరలో పచ్చజెండా ఊపనున్నది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ పం చాయతీ పోరుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలు చేరుకున్నాయి. ఎన్నికల సామగ్రిని కూడా అవసరమైన మేరకు పంపించారు. వార్డుల విభజన, గ్రామపంచాయతీల వారీగా నిర్వహించారు. జనాభా ప్రతిపాదికన ఏర్పాటు చేసిన వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే మిగిలింది. ఈసారి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ క ల్పించాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వం ఓకే చెబుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.. మొత్తంపైన ఐదు జిల్లాలోని 1,692 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఏ స మయంలో ప్రకటించి నా ఆయా జిల్లా ల య ంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా రాజకీయ పక్షాలు సైతం స్థానిక సమరానికి సై అంటున్నాయి.
యంత్రాంగం సన్నద్ధం
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన తక్షణమే ఏర్పాట్లను సజావుగా నిర్వహించేందుకు అధికార య ంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా పంచాయతీ అధికారులు స్థానిక ఎంపీడీవోలతో కలిసి పంచాయతీ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆయా జిల్లాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి బ్యాలెట్ పత్రాలు రాగా.. ఎన్నికల సామగ్రి కూడా అవసరం మేర కు సిద్ధం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉండడంతో అధికారగణం వేచి చూస్తున్నది. ఇదిలా ఉండగా ఈనెల 21 నుంచి 24 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకుగానూ వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈ పథకాలు అమలు చేసిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష ఎన్నికలా.. పరోక్ష ఎన్నికలా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు దండుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ త ర్వాత హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. దీంతో గతేడాది నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయి దా వేస్తూ వచ్చింది. ఈ లోపు ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పంచాయతీ ఎన్నికలు ఊసే ఎత్తలేదు. చివరకు గ్రామాల్లోని అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యకమవుతుండడం తో ఈ ఎన్నికలను అడ్డంపెట్టుకొని అమలుకు శ్రీకారం చుడుతున్నది. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయా..? లేక పరోక్షంగా జరుగుతాయా..? అనేది క్లారిటీ ఇవ్వడం లే దు. అంతేకాకుండా వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియపై కూడా స్పష్టత లేదు. పరోక్షంగా జరిగితేనే మేలని అధికార పెద్దలు భావిస్తున్నారు.
రిజర్వేషన్లపై సందిగ్ధం..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం 33 శాతం అమలు చేస్తే దాన్ని పెంచుతామని ఇచ్చిన హామీని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టుకుంటారా? లేదా? అనేది తేలడం లేదు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ప్రాతినిథ్యం పెరుగుతున్నది. మిగతా వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతారా? రిజర్వేషన్లపై వెనక్కి పోతారనేది ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వేషన్లు ఖరారు కావాలంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ లేదని, కాకపోతే.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని ఆయా జి ల్లాల కలెక్టర్లు అంటున్నారు.
సై అంటున్న రాజకీయ పక్షాలు
స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రితో సహా మంత్రులు అక్కడక్కడ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు అధికార య ంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తోం ది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలోని దాదాపు 90 శాతం స్థానిక సంస్థలను బీఆర్ఎస్ కైవసం చేసుకొన్నది. స్థానిక సంస్థల ఎ మ్మెల్సీని కూడా సునాయాసంగా గెలుపొందింది. ఈసారి పథకాలను అడ్డం పెట్టుకొని అత్యధిక పంచాయతీలో పాగా వేయాల ని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. అయితే బీఆర్ఎస్ గత రికార్డుని తిరగరాయాలని భావిస్తుంది. ఇక బీజేపీ కూడా ఉమ్మడి జిల్లా లో ప్రభావాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
బీఆర్ఎస్దే విజయం..
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్సే విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అదే ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారు. రైతు రుణమాఫీ అంటూ ఊరించి గ్రామాల్లో కొంత మందికి మాత్రమే మాఫీ చేసి మిగతా వారికి మొండిచేయి చూపించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరో సా, ఆత్మీయ భరోసా అంటూ అనర్హులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయలేక చేతులు ఎత్తడం ఖాయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీదే గెలుపు ఖాయం.
– విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే, జోగుళాంబ గద్వాల జిల్లా
జిల్లా :పంచాయతీలు : వార్డులు
మహబూబ్నగర్ :441 : 3,836
నారాయణపేట :280 : 2,455
వనపర్తి :255 : 2,366
నాగర్కర్నూల్ :461 : 4,140
గద్వాల :255 : 2,390