గద్వాల, ఫిబ్రవరి 1: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 423 రోజుల్లో 412 మంది రైతులు ఆ త్మహత్య చేసుకున్నారని.. రైతులకు బీఆర్ఎస్ తర ఫున భరోసా కల్పిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీ ఆర్ఎస్ భవన్లో గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతునాయుడుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు. అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పారు.
వచ్చిన తర్వాత అబద్ధ్దాలు చెబుతూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆత్మైస్థెర్యం కోల్పోతున్నారని ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ క్రమంగా రైతుల అభివృద్ధికి సహకరించి.. వారిలో ఆత్మైస్థెర్యం నింపితే ప్రస్తుతం కాం గ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైతులు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలన లో రైతులకు ఇబ్బందులు లేకుండా రైతుబంధుతోపాటు రుణమాఫీ, 24గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు అందించడంతో రైతులు సంతోషంగా వ్యవసాయాన్ని చేసుకునే వారన్నారు.
కాంగ్రెస్ విధానాలతో రైతులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారన్నారు. రైతాంగానికి భరోసా ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతాంగానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ వేసిందని.. కమిటీ బాధిత కు టుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం నింపుతుందని తెలిపారు. కేంద్రం పల్లికి మ ద్దతు ధర రూ.6783 కల్పిస్తే గద్వాల వ్యవసాయ మార్కెట్‌తోపాటు రాష్ట్రంలో అన్ని మార్కెట్లలో రై తులకు మద్దతు ధర రాక అవస్థలు పడుతున్నారన్నారు. మద్దతు ధర రాకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వానికి ప ట్టింపు లేదని చెప్పారు. గతనెల మొత్తంలో గద్వాల వ్యవసాయ మార్కెట్లో రైతులకు కనీస మద్ధతు ధర రూ.6 వేలు దాట లేదన్నారు.
ఎక్కువ మంది రైతులు తమ పంట ఉత్పత్తులను క్వింటా రూ.2వే లు మొదలు కొని 4వేల వరకు అమ్ముకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే కనీసం రూ.7వేల నుంచి రూ.9వేల వర కు ధర వచ్చేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అలాంటి మద్ధతు ధర ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులంటే కాంగ్రెస్ పాలకులకు చులకన కాబట్టే ఇలా చేస్తుందన్నారు. మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే సోయి ఈ పా లకులకు లేదన్నారు. వంటనూనెల ఎగుమతుల కో సం కేంద్రం రూ.లక్ష కోట్లు చెల్లిస్తుందన్నారు. నూనెగింజల ఉత్పత్తులు పెంచాలని కేం ద్ర, గత ప్రభుత్వం ఆలోచించి రైతులకు మద్దతు ధర కల్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ పల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఇక్రిషాట్ శాస్త్రవేత్తలు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కందితోపాటు పత్తి పంటకు మద్ధతు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చివరి దశలో సీసీఐ వారు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో అది చిన్న, సన్నకారు రైతులకు ఎటువంటి ఉపయో గం లేకుండా పోతుందన్నారు. మద్ధతు ధర కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంటుందని.. అవి అమలవుతున్నాయా లేదా అనే ది పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి ఎంపీలు, కేంద్రమంత్రు లు ఏనాడైనా రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందుతుందనే విషయం ఏరోజైనా మాట్లాడా రా అని ప్రశ్నించారు.
ఇది రైతు వ్యతిరేఖ ప్రభుత్వమని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు రైతు భరోసా రూ.17,500 ఇ వ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 26న ప్రకటించిన రైతు భరోసా మండలంలో ఒక గ్రామానికి ఇచ్చి మిగతా రైతులను ఎండబెట్టారన్నా రు. ఎన్నికల కోడ్‌తో వాటిని నిలుపుదల చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్ధాల మాటలు నమ్మి ఓట్లు వేశాం.. ఇక భరించాల్సిందే అన్నారు. ఎండకాలం వస్తుంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ క ష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తమ పరువును కాంగ్రెస్ నాయకులు పోగొట్టుకుంటున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, కురువ పల్లయ్య, మోనేశ్, రాజు, జనార్దన్‌రెడ్డి, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.