కల్వకుర్తి రూరల్, జనవరి 7 : తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయి రోదిస్తున్న గుర్తు తెలియని బాలుడిని ఆదివారం పోలీసులు గుర్తించారు. కల్వకుర్తి ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ లో ఆదివారం సాయంత్రం తల్లిదండ్రుల కో సం రోదిస్తున్న బాలుడిని స్థానికులు గుర్తించారు.
వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా మాటలు రావని గుర్తించిన వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరకొని బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాలుడిని గుర్తిస్తే కల్వకుర్తి పీఎస్‌లో సంప్రదించాలని సూచించారు.