అనుమతి ఇచ్చారు.. రద్దు చేశారు
మున్సిపల్ ఎన్నికలో అధికారుల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి వార్డుల్లో తమ వాహనాలతో యథేచ్ఛగా తిరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. అయితే గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు గద్వాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల్లో ఎన్నికల సరళిని పరిశీలించడానికి బీఆర్ఎస్ తరఫున తన వాహానానికి ఎన్నికల అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నా రు.
- హనుమంతు నాయుడిని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు
- వార్డుల్లో యథేచ్ఛగా తిరిగిన కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు
- పట్టించుకోని ఎన్నికల అధికారులు, పోలీసులు
గద్వాల, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికలో అధికారుల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి వార్డుల్లో తమ వాహనాలతో యథేచ్ఛగా తిరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. అయితే గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు గద్వాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల్లో ఎన్నికల సరళిని పరిశీలించడానికి బీఆర్ఎస్ తరఫున తన వాహానానికి ఎన్నికల అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నా రు. అయితే ఆయన వార్డుల్లో తిరిగే క్రమంలో కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోవడంతో ఆయన వాహానానికి ఇచ్చిన పర్మిషన్ను మున్సిపల్ కమిషనర్ రద్దు చేశారు.
ఆయనను బయటకు వెళ్ల నీయకుండా ఒక ఎస్సైతోపా టు పోలీసులను ఇంటి దగ్గర కాపలా ఉంచారు. పోలీసుల ఏకపక్ష తీరుపై హనుమంతునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా కార్లలో అన్ని వార్డుల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదేక్కడి న్యాయమని పోలీసులను ప్రశ్ని స్తే వారు సమాధానం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తు వైపు మొగ్గు చూపడంతో ఇది నచ్చని నాయకుడు తమ ను పోలీసులతో ఇంట్లో ఉండేలా చూశాడన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి కాంగ్రెస్ కండువా మెడలో వేసుకొని పో లింగ్ స్టేషన్ బూతుల్లోకి వార్డుల్లో తిరిగినా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.16, 18, 19 వార్డుల్లో ఎమ్మెల్యే ఫొటోతో స్లిప్ పంచారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో అరాచకాలు సృష్టించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం చేయడంపై ఆయ న మండిపడ్డాడు. వీరి దౌర్జన్యాలపై ఎన్నికల సం ఘం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతేలో ప్రజ లే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

