వనపర్తి, మార్చి 26 : తొమ్మిదేండ్ల పాలనలో ఊహించని అభివృద్ధి సాధించామని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వ్యవసాయరంగంలో వనపర్తిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మండలంలోని 10గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మంత్రి ఆ ధ్వర్యంలో ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్ల కిందట ఈ ప్రాంతంలో కృష్ణ నీళ్లతో ఒక్క ఎకరా సాగుకాలేదని.. నేడు లక్ష ఎకరాలు పంటపొలాలు సాగవుతున్నాయన్నారు.
మహారాష్ట్రలో మాజీ సీ ఎం శరద్‌పవార్ రైతుల కోసం సహకారసంఘాలతో సహకార చక్కెర కర్మాగారాలు పెట్టించి సాధించిన విజయాలే తమకు ఆదర్శమన్నారు. రాబోయేకాలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నామని.. వనపర్తి నియోజకవర్గంలో 70,345మంది బీఆర్ఎస్ సభ్యత్వం పొందారని గుర్తుచేశారు. లబ్ధిదారులు, ప్రజలందరూ తమవైపే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కుటుంబాలను కలుసుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, బీఆర్ఎ స్ జిల్లా శిక్షణా తరగతుల అధ్యక్షుడు పురుశోత్తంరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో చేరికలు
వనపర్తి, మార్చి 26 : వనపర్తి పట్టణంలోని 4వ వార్డుకు చెందిన 40మంది యువకులు సూర్యవంశం మునికుమార్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోని సాదరంగా ఆహ్వానించారు.