గద్వాల అర్బన్, మార్చి 6 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పేర్కొన్నారు. గద్వాల జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో మిర్చి క్రయ, విక్రయకేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మిర్చి పండించే రైతులు పం టను అమ్మడానికి ఇబ్బందులకు గురవుతుండడంతో ప్రభుత్వం గుర్తించి జిల్లాకేంద్రంలోనే మార్కెట్‌ను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిందన్నారు.
ప్రతి సోమవారం మిర్చి మార్కెట్ ఉంటుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా మొదటిరోజు 45 క్వింటాళ్ల మిర్చి రాగా అత్యధికంగా క్వింటాకు ధర రూ. 27,113, మధ్యస్తంగా రూ.21,020, అతి తక్కువగా ధర రూ.8,013 పలికినట్లు అ ధికారులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సయ్యద్ ఇఫ్తాకర్ నజీబ్, మార్కెటింగ్‌శాఖ ఉప సంయుక్త సంచాలకులు పద్మహర్ష, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, కార్యాలయ అధికారులు నర్సింహ, శ్రీనివాసులు, గంజి అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖరయ్య, నర్సింహులు తదితరులున్నారు.
పత్తిమార్కెట్ యార్డు రోడ్డు పరిశీలన
జడ్చర్ల, మార్చి 6: జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులోని బాదేపల్లి పత్తి మార్కెట్‌యార్డు రోడ్డును మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సోమవారం పరిశీలించారు. గతంలో ఇచ్చిన రోడ్డుకు బదులుగా పత్తిమార్కెట్‌కు ఆనుకొని ఉన్న వెంచర్రోడ్డును ఇస్తామని ఆ వెంచర్ యజమాని మార్కెటింగ్‌శాఖకు అర్జీ పెట్టుకోగా క్షేత్రస్థాయిలో రోడ్డును పరిశీలించారు. ఆమె వెంట మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తేకర్ నజీబ్, డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి నవీన్‌కుమార్ తదితరులున్నారు.