నాగర్‌కర్నూల్, జనవరి 17 (నమస్తే తె లంగాణ) : ‘మనం ఉద్య మ వీరులం.. కార్యశూరులం.. ఉద్యమానికి ఊపిరిలూదిన వాళ్లం.. పేగులు తెగేదాకా మన మాతృభూమి కో సం కొట్లాడిన వాళ్లం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది.. మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం.. ప్రతిపక్షంలో ఉండి కూ డా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉ న్నంత వరకు పోరాడుదాం.. తెలంగాణ సమస్యలు, విభజన సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో బీఆర్ఎస్ ఉండి తీరాల్సిన సమయం ఇదే’ అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామని, ఇది 11వ సమావేశమని, ఇప్పటివరకు ఊహించినదానికన్నా విలువైన సూచనలు వచ్చాయన్నారు. కార్యకర్తలు కోరుకుంటున్నదే రాబోయే రోజుల్లో జరుగుతుందన్నా రు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పని చేస్తుందన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తం డ్లాడామని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్నారు. ఇప్పుడు మన పార్టీ స్థానం మారిందని, పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చామని, అయినా అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు అక్కర్లేదన్నా రు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాల కాలంలో ప్రభు త్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా పదేండ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఐదేండ్లకే ప్రభుత్వాలు మారాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి రూ. మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ కావాలని, మన బడ్జెట్ మాత్రం రూ.2.90 లక్షల కోట్లే అన్నారు. అధికారం ఎలాగూ రాదని అరచేతిలో వైకుంఠం చూపేలా మోసపూరిత హామీలతో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి, ఇప్పుడు అవసరం లేని విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్యా రెంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
విభజన సమస్యలు, తెలంగాణ సమస్యలకు పరిష్కారం రావాలంటే ఈ కీలక సమయంలో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే తెలంగాణకు నష్టం కలుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగుదామని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేమని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని, కాం గ్రెస్ 11వ హామీ కింద చేర్చిందని విమర్శించారు. కేం ద్రం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు రో జూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదే అన్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగో లు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారన్నారు. శ్వేతపత్రం పేరిట మనల్ని బద్నాం చేసే ప్రయత్నం చేసి తీసిన గోతిలోనే కాంగ్రెస్ పడిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా కేసీఆర్ ప్రభు త్వం కొనసాగించడం వల్లే గత పదేండ్లలో తెలంగాణలో 83శాతం పేదరికం తగ్గిందన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యారాజకీయాలు మొదలు పెడుతోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్ధతి కాదని, మా ర్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా వందరోజులు కాలేదని, అందుకే ఆగుతున్నామ ని, లేకపోతే చీల్చిచెండాడే వాళ్లమన్నారు కొన్ని రోజులైతే ప్రజలే ఇండ్లల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను రండి రండి అంటూ బయటకు తీసుకొస్తారన్నారు. అంతకుముందు పలువు రు ప్రజాప్రతినిధులు, మాజీలు, పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు తమ అభిప్రాయాలను వివరించా రు. కాగా సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నా గం జనార్దన్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మె ల్సీ గోరటి వెంకన్న, జోగుళాంబ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీ రం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బైకని శ్రీనివాస్‌యాదవ్, జక్కా రఘునందన్ రెడ్డి, నాగం శశిధర్‌రెడ్డి, ఏడు అసెంబ్లీ ని యోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.