మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయతీ ఇన్చార్జీల నుంచి బాధ్యతలు స్వీకరించారు. గ్రామపంచాయతీలను అం దంగా ముస్తాబు చేసి కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేశారు.
కొన్నిచోట్లా గ్రామ పంచాయతీ ఆవరణలో బహిరంగ సభను కూడా నిర్వహించి కొత్తగా ఎన్నికైన సర్పంచులు తాము గ్రామాలకు ఏం చేస్తాము ప్రజలకు వివరించారు. కొన్ని చోట్లా సర్పంచులు బీఆర్ఎస్ మద్దతుదారులు ఉంటే మరికొన్ని చోట్లా ఉపసర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు ఉన్నారు. వీరు పోటాపోటీగా వాగ్దానాలు గుప్పించారు. కొన్ని గ్రామపంచాయతీలు అయితే ఏకంగా తమ మద్దతుదారులకు విందులు ఏ ర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు అభినందనలు తెలిపారు.
అలాగే ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సర్పంచ్ అనితాసాగర్ బాధ్యతలు చేపట్టగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అభినందించారు. అదే విధంగా భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో అన్నాసాగర్ సర్పంచ్ ఆల శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పెంట్లవెల్లిలో సర్పంచ్ చిట్టెం ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మక్తల్ మండలం గుర్లపల్లిలో సర్పంచ్ గాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి, కల్వకుర్తి నియో జకవర్గంలోని మార్చాల సర్పంచ్ కృష్ణారెడ్డి ప్ర మాణ స్వీకారోత్సవంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, నవాబ్‌పేట మండలం పల్లెగడ్డ, దర్పల్లిలో సర్పంచులు బాలరాజు, బాలకిష్ట మ్మ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ఎం పీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. వచ్చే ఐదేండ్లలో గ్రామపంచాయతీలు అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పథ ంలో తీసుకువెళ్లాలని వారు పిలుపు నిచ్చారు.