అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 14 : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఫలితం శూన్యం కావడంతో మిర్చి రైతు కంట్లో కన్నీరు కారుతున్నది. రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో పంటలను బతికించుకునేందుకు రూ.లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నా ఒక్క కేజీ దిగుబడి కూడా రాకపోవడంతో పంటలను కాపాడుకోలేక వందల ఎకరాల్లో మిర్చి పంటలను రైతులు తొలగించుకుంటున్న ఘటనలు మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేం ద్రంలో కనిపిస్తున్నాయి. మానవపాడు మం డలం మొదటి నుంచి మిర్చి పంట సాగు చే యడంలో మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడ పండించిన మిర్చి పంటను ముంబాయి, క ర్ణాటకతోపాటు ఇతర రాష్ర్టాలను వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు.
అంతటి డిమాండ్ ఉండడంతోనే 16 కిలో మీట ర్ల దూరంలోనే 8 గోదాములు ఉన్నాయంటే ఇక్కడి మిర్చి పంటలను రైతులు ఎలా సాగు చేస్తున్నారో అర్థం అవుతున్నది. ప్రతి ఏడాది మానవపాడు, ఉండవెల్లి మండలంలో 16 వేల ఎరకాలపైనే మిర్చి పంటలను రైతులు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది కూడా రైతులు అధికంగా రెండు మండలాల్లో మిర్చి సాగు చేశారు. కానీ గత రెండు నెలలుగా భా రీ వర్షాలు కురవడం, చాలా రోజులు పొల్లా లో వర్షం నీరు నిల్వ ఉండడంతో మిర్చి పం టలకు తెగుళ్లు సోకి మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో లక్షలు పెట్టి రసాయన ఎరువులు, పురుగుల మందు ఉపయోగించినా పంటమాత్రం చేతికి అందలేదు. దీంతో మం గళవారం మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో రైతులు చేసేది లేక ట్రాక్టర్లతో, ఎద్దులతో మిర్చి పంటలను తొలగించుకున్నారు. మరికొంత మంది రైతులు మిర్చి పంటలను ఏలాగైన కాపాడుకోవాలని చివరి దశ వరకు పంట వస్తుందని ఎదురుచూస్తున్నారు.
ఒక్క కేజీ దిగుబడి లేదు..
సాధారణంగా ప్రతి ఏడాది ఈ సమయానికి పొలాల్లో మిర్చి నిండుగా పూతతో కా యలు కాస్తాయి. కాయలు కాసిన నెల రోజులోనే రైతులు మిర్చి పండును తెంపి కల్లాల్లో ఆరబేడుతారు. అయితే వర్షాల కారణంగా ఇంత వరకు పొలాల్లో మిర్చి సాగుకు పూత కూడా రాలేదు. దీంతో ఈ ఏడాది మిర్చి పం ట ఒక్క కేజీ కూడా దిగుబడి రాదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్క ఎకరాకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం. ఈ ఏడాది పంటలు పండడం లేదని తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదని ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
రూ.లక్ష పెట్టుబడులు పెట్టా..
ఈ ఏడాది పదెకరాల్లో మిర్చి పంటను సాగు చేశా ను. వర్షాల వల్ల మిర్చిపంట మొత్తం కుళ్లిపోయి నాశనమైయింది. ఎకరా కు లక్ష రూపాయాలు చొప్పున 10 ఎకరాలకు రూ.10 లక్షలు ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టాను. అయితే ఒక్క కేజీ కూడా పంట చేతికి రాలేదని అందుకే 10 ఎకరా ల్లో ఉన్న మిర్చి సాగును తొలగించాను.
-శ్రీకాంత్‌రెడ్డి, రైతు, మానవపాడు