ఖమ్మం అర్బన్, మార్చి 1 : రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళి సమర్పించిన విద్యా విధానపత్రం-2026 అమలుచేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌చేశారు. ఆదివారం యూటీఎఫ్ భవన్ ఖమ్మంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉపాధ్యాయుల వేతనాలు ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇచ్చేవికావని, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ వర్తించేలా పీఆర్సీ సిఫారసు మేరకు ఇస్తారని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసులతో విద్యారంగానికి ఒరిగేదేమిలేదని, ప్రస్తుతం ఉన్న 7.5శాతం బడ్జెట్‌ను 15శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.