హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఆశీష్ అంకెం ఎన్నికయ్యారు. ఆదివారం ఆన్లైన్ పద్ధతిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించిన అనంతరం టీఎస్ఆర్డీఏ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చంద్రికారెడ్డి, అధికార ప్రతినిధిగా హరిణీసూరి, ఉపాధ్యక్షులుగా రాహుల్ కొమ్ము, వంశీకృష్ణ మోరె, సందీప్ అరోల్లా, సాయిదీప్ తోట ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలందేలా తమవంతు కృషిచేస్తామని పేర్కొన్నారు.