ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
- పాలమూరు మైనార్టీ గురుకులంలో స్టూడెంట్ మృతిపై అనుమానం
- కళాశాల ఎదుట కుటుంబ సభ్యుల నిరసన
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 1 : విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని భూనీడ్‌కు చెందిన లక్ష్మి, హనుమంతురెడ్డి దంపతుల ఒ క్కగానొక్క కుమారుడు రాంరెడ్డి(17) మహబూబ్‌నగ ర్ మైనార్టీ గురుకుల పాఠశాల-2లో ఇంటర్ సీఈసీ సె కండియర్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి న్యూ ఇ యర్ వేడుకల్లో మిత్రులతో కలిసి రాత్రి 3 గంటల వ రకు సరదాగా గడిపాడు. అనంతరం హాస్టల్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న కళాశాల తరగతి గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొన్నాడు. సోమవారం ఉదయం 9:30కు గుర్తించిన నిర్వాహకులు రాంరెడ్డిని కిందకు దించి హుటాహుటిన జిల్లా దవాఖానకు తరలించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వి షయం తల్లిదండ్రులకు తెలపడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున కళాశాలకు తరలివచ్చి రాంరెడ్డి మృతిపై విచార ణ నిర్వహించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
ప్రిన్సిపాల్ బుర్కాఫాతియా మాట్లాడుతూ రాంరెడ్డి బాగా చదివేవాడని, కళాశాలలో ఏం జరిగి ఆ త్మహత్యకు చేసుకున్నాడో తెలియడం లేదన్నారు. రాం రెడ్డికి ఎలాంటి సమస్యలు లేవని, చదువులోనూ చురుకుగా ఉండేవాడని, అందరితో కలుపుగోలుగా ఉంటాడని, ఆత్మహత్య చేసుకొనే పరిస్థితే లేదని బాధిత కు టుంబ సభ్యులు తెలిపారు. అనంతరం రాంరెడ్డి మృతి పై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, రూ. 50 లక్షలు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దవాఖాన వద్ద ఆందోళన నిర్వహించా రు. ఆత్మహత్య విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు సీఎం అన్న తిరుపతిరెడ్డికి ఫోన్లో తెలిపా రు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ మహేశ్ సీఐలు ప్రవీణ్ కుమార్, సైదులు, శ్రీనివాస్, చంద్రశేఖర్‌తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అ నంతరం రాంరెడ్డి మృతిపై కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

