లక్ష్యానికనుగుణంగా చదవాలి
అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయంగా మారిందని ఆయన అన్నారు.
- విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలి
- వనపర్తిని విద్యాహబ్‌గా మార్చడమే లక్ష్యం
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- నియోజకవర్గ స్థాయి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హాజరు
అచ్చంపేట టౌన్, ఆగస్టు 18 : అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయంగా మారిందని ఆయన అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న వాసవీ టెంపుల్ వీధి గుండా సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉట్ల కోనేరు నుంచి మెయిన్ రోడ్డు వరకు సీసీ పనులకు శంకుస్థాపన చేశారు. గింజల మార్కెట్ పక్కన నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదంటే అది వ్యవసాయరంగం ద్వారానేనని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులను ప్రభుత్వం అక్కున చేర్చుకొని వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చిందన్నారు.
ఒకే రోజులో రూ.6వేల కోట్ల రుణమాఫీ చేయడం ట్రెజరీ చరిత్రలోనే రికార్డన్నారు. రూ.17వేలకోట్లు 2018 వరకు మొదటి విడతలో రుణమాఫీ చేశామని, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక రూ.36వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశామన్నారు. విపక్షాల తీరు ఒంటె పెదవులకు నక్క ఆశపడినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. రూ.5వేలు, రూ.10వేలకు ఎకరా భూమి అమ్ముకున్న పరిస్థితి నుంచి నేడు రూ.20లక్షల నుంచి రూ.50లక్షలు, రూ.కోటి, రూ.2 కోట్ల ధర పలుకుతున్నాయ న్నారు. అంతర్జాతీయ పత్రికలో కూడా హైదరాబాదులో ఎకరా రూ.100 కోట్లు పలుకుతుందని ప్రచురించారంటే.. మనం ఎంతగా అభివృద్ధి చెం దామో ఇట్టే అర్థమవుతుందన్నారు. కేంద్రం సహకరించకున్నా విజయవంతంగా పథకాలు అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణలో అత్యధిక ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
అందువల్లే పక్క రా ష్ర్టాల వారు వలసొచ్చి తెలంగాణలో ఉపాధి పొం దుతున్నారని తెలిపారు. వ్యవసాయరంగాన్ని బ లోపేతం చేస్తే దాని చుట్టూ అల్లుకున్న రంగాలన్నీ బలపడతాయన్నారు. ఒకప్పుడు వ్యవసాయాన్ని సంక్షేభంలోకి నెట్టేశారు. అందుకనే మలిదశ ఉద్యమానికి ప్రజలు అండగా నిలిచారు. పట్నంబాట పట్టిన ప్రజలను తిరిగి పల్లెబాట పట్టించామని తెలిపారు. పంటకు అధిక ఆదాయం లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆహార మండళ్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పట్టణంలోని సీసీరోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ అన్ని వసతులు సమకూర్చామన్నారు. అచ్చంపేట పరిసర ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి పలు లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించామని, టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, వైస్‌చైర్మన్ శైలజ, మార్కెట్‌కమిటీ చైర్మన్ అరుణ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

