హైదరాబాద్, జూలై 29: ఎంటార్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ పన్నులు చెల్లించిన తర్వాత రూ.50.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.10.8 కోట్లతో పోలిస్తే మూడింతలకు పైగా వృద్ధి నమోదైంది. అలాగే కంపెనీ ఆదాయం రెండింతలు ఎగబాకి రూ.360.7 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.