మూసాపేట(అడ్డాకుల), జనవరి 9 : అడ్డాకుల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో నెలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లడుతూ పాఠశాలలో 500 మంది ఉండగా అందులో 300 మంది వరకు విద్యార్థినులు ఉన్నారన్నారు. కాగా పాఠశాలలో బాలికలకు రెండు మరుగుదొడ్లు ఉండగా అందులో ఒ కటి నిరుపయోగంగా ఉందన్నారు.
బాలురులకు రెండు మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. బాలుర, బాలికల మరుగుదొడ్లు రెండు ఒకే చోట ఉండడంతో విరామ సమయంలో తీవ్రఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉపాధ్యాయులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. వెంటనే పాఠశాలలో మౌళిక వసతుల సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.