మక్తల్, నవంబర్ 22 : మాగనూరు జెడ్పీహెచ్ ఎస్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం విధితమే.
ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు వచ్చిన పలువురు విద్యార్థులు పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని కాకుండా తమ ఇంటి నుంచి తెచ్చుకొన్న అన్నాన్ని భుజించారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ వారిని పలుకరించగా రెండు రోజులుగా పాఠశాలలో వండిన అన్నం లో పురుగుల రావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అందుకే ఇంటి నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకొని తింటున్నామని వివరించారు.