దవాఖానకు తరలింపు
నవాబ్‌పేట, జూలై 28 : మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సాత్విక సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వారి కారులో నవాబ్‌పేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే.. కోయిలకొండ మండలం దమ్మాయపల్లి గ్రామానికి చెందిన సాత్విక యన్మన్గండ్ల బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది.
కాగా గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో సాత్వికకు ఫీవర్‌తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. హాస్టల్లో బాలికలకు చల్లటి నీరు ఇవ్వడంతో పరిస్థితి విషమించి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఉదయం పాఠశాలకు వెళ్లిన 1గంటలోపే స్పృహ తప్పి.. తరగతి గదిలోనే కింద పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు వి ద్యార్థినిని నవాబ్‌పేట దవాఖానకు తరలించారు. అక్క డి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు తరలించారు. హాస్టల్ వార్డెన్ బందె మ్మ అందుబాటులో లేక పోవడంతోనే అక్కడ పని చేసే వర్కర్లు విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేద నే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వార్డెన్ బందెమ్మతో మాట్లాడగా అమ్మాయి అస్వస్థతకు గురైన విషయం తనకు తెలియదని, ఇప్పుడే తెలుసుకుంటానని చెప్పారు.