నాగర్‌కర్నూల్, జూలై 14 : పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు క న్నెర్ర చేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భా రీ ర్యాలీతో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టా రు. కలెక్టర్‌కు వినతి ఇచ్చేందుకు వెళ్తున్న విద్యార్థులను అడ్డుకొని గేటు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రూ.8,156 కోట్లు బకాయిలు విడుదల చేయాలని డి మాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లు అనేది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యావకాశాలను అందించడానికి భారత రాజ్యాంగం కల్పించి న హక్కు అని, అది ఎవరి భిక్షకాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, గెస్ట్ ఫ్యాకల్టీలతో విద్యార్థులకు విద్యను బోధించడం అ సాధ్యం అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీ.సీ, మైనార్టీ వర్గాలు ఉన్నత విద్య అందుకొని ఈ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండడం ద్వారానే ఈ సమాజాభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రభుత్వం 8,156 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆ వేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలో కి వచ్చి 18 నెలలు గడిచినా విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నా రు. అంతేకాకుండా భారతదేశం లోనే విద్యాశాఖ మం త్రిలేని రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ప్ర జాపాలన పేరుతో మాయమాటలు చెబుతూ కాలం గ డుపుతున్నారని, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ప్ విడుదల చేయాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.