గట్టు, ఆగస్టు 4 : మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలు రాశారు. సోమవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంకు రాసిన లేఖ ప్రతులను చూపించారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా మాట్లామా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలుడుతూ పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదన్నారు. మూత్రశాలలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మధ్యాహ్న భోజనం కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. సమస్యల న్నింటినీ పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, రఫీ, షకీల్ తదితరులు పాల్గొన్నారు.