మక్తల్, మార్చి 21 : వేసవి ప్రారంభంలోనే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తు తం రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ అడుగంటి పోతున్నాయి. దీంతో యాసంగిలో వరి పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొన్నది. మక్తల్ నియో జకవర్గానికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మించిన భీమా లిఫ్ట్ సాగు నీటిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ ఎత్తిపోతల్లో భాగమైన మక్తల్ సమీ పంలోని సంగంబండ పెద్దవాగుపై ఉన్న చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూరు రిజర్వాయర్లు సైతం జలకళను కోల్పోతున్నాయి. 1.10 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించాల్సిన ఈ రెండు రిజర్వాయర్ల నుంచి సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నీటి లభ్యత తక్కువగా ఉండగా.. అధికారులకు గానీ.. పాలకులకు గానీ ముందుచూపు లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.
సంగంబండ రిజర్వాయర్లో ప్రస్తు తం 1.2 టీఎంసీలు నిల్వ ఉండగా.. నాలుగు కెనాల్స్ పరిధి లో 12 వేల ఎకరాలలో వరి పంట సాగైంది. సంగంబండ ప్రాజెక్టులో పంటలకు సరిపడా నీళ్లు ఉన్నా.. కొన్ని కాల్వల ద్వారా నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన చెందు తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు అందు తాయో..? లేదో..? అన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది. ఇక భూత్పూరు రిజర్వాయర్లో 0.14టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆయకట్టులో 4,500 ఎకరాలలో వరి పంటను రైతులు సాగు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అడుగంటి పోవడంతో పంటలు గట్టెక్కుతాయో..? లేదో? అన్న సందే హాలు వ్యక్తమవు తున్నాయి. రోజురోజుకూ రెండు రిజర్వా యర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గి పోతుండడంతో యాసంగి పంట సంక్షోభంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంగంబండ, భూత్పూరు రిజర్వాయర్లు నీటితో నిండుగా కళకళలాడేవి. రైతు లకు సాగు నీటి కష్టాలు రాకుండా ముందు గానే అధికారులతో ప్రణా ళికలు సిద్ధం చేయించేవారు. దీంతో నడి వేసవిలో సైతం సాగునీరు పుష్కలంగా పారేది. చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు పారి పంటల దిగుబడి పుష్కలంగా వచ్చేది. పంటలకు నీటిని అందించడంతోపాటు చిన్నచిన్న చెరువులకు సైతం రిజర్వా యర్ల నుంచి నీటిని విడుదల చేసేవారు. నాడు అదనంగా 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం జరిగేది.
సమయానికి రైతుబంధు సాయం అందుతుండగా వ్యవసాయం ఇష్టంతో చేసేటోళ్లు..
సాగునీటిపై ఆందోళన ప్రస్తుతం సంగంబండ, భూత్పూరు రిజర్వాయర్లలో నీటి మట్టం పూర్తిస్థాయిలో అడుగంటడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటల సాగుకు పెద్ద ఎత్తున వడ్డీలకు డబ్బులు తెప్పి పెట్టుబడులు పెట్టామని పలువురు ఆందోళన చెందుతు న్నారు. అధికారులకు ముందస్తు ఆలో చనలు లేకపోవడంతోనే సాగునీటి గోస తలెత్తిందని వాపోతున్నారు. ప్రభుత్వం సరైన ప్రణాళికలు రూపొందించి ఉంటే రైతుకు ఈ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉం డేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధు లు, అధికాలు స్పందించి పంటలు చేతికందే వరకు సాగునీరు అందిం చాలని రైతులు కోరు తున్నారు.