మహబూబ్‌నగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హెచ్చరికతో సర్కారు దిగొచ్చింది. సరిగ్గా 30 నెలల కిందట ఉమ్మడి పాల మూరుపై కపట ప్రేమను ప్రదర్శించేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజులు జిల్లా పర్య టిస్తున్నారు. ఈ పర్యటనల్లో ఎక్కువ భాగం గాల్లో చక్క ర్లు కొట్టడం చూస్తుంటే మరోసారి మోసానికి తెర లేపుతున్నారని అర్థమవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబు తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ మానస పుత్రిక అయిన కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం పరిశీలన కూడా ఇందులో భాగం కావడం గమనార్హం. సర్కారులో నెంబర్ టూ మంత్రిగా చలామణి అవుతున్న పొంగులేటి కంపెనీ చేపడుతున్న ఈ ఎత్తిపోతల పథకా నికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది.
ముందుగా పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష చేపట్టి పెండింగ్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు ప్రకటించిన సర్కారు ఆ తర్వాత వెంటనే మాట మార్చి ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులను కూడా సమీక్షిస్తారని ప్రకటించ డంతో ఈ అనుమానాలకు బలం చేకూరు తోం ది. ఇందుకు నిదర్శనంగా ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా మక్తల్‌కు చేరుకొని నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కాన్ని పరిశీలించి అక్కడే ఉన్నత స్థాయి సమీక్ష చేపడుతున్నారు. ఆ తర్వాత జూరాల, గుడ్డెందొడ్డి రిజర్వాయ ర్లను పరిశీలించి రాత్రికి కొల్లా పూర్‌కు చేరుకోనున్నారు. స హచర మంత్రి జూపల్లి ఇలాకాలో బస చేసి అక్కడే ఇతర ప్రాజెక్టులపై సమీక్ష చేపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ సర్కార్ ప్రా ధాన్యం ఇవ్వడం లేదనేది తేటతెల్లం అవుతున్నది.
అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే పాలమూరును కూడా ఒక ప్రా జెక్టు లాగా సమీక్ష జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇది లా ఉండగా గత నెల 15న మహబూబ్‌నగర్‌లో సమా వేశమైన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణిదేవి, నవీన్ కుమార్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కలిసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు పాదయాత్ర నిర్వహించాలని తీర్మానించారు. ఈ జిల్లాకు చెందిన రేవంత్ సీఎం అయినప్పటికీ ప్రాజెక్టును పడావు పెట్టి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడుతూ సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ఆందో ళనకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా కనీసం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష జరుపకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు.
దీంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నయా పైసా కేటాయించకపోవడం.. పనులన్నీ ఆగిపోవడంతో ఎక్కడ బీఆర్ఎస్కు మైలేజ్ పోతుందోనని హడావుడిగా రెండు రోజుల తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య మంత్రిని కలిశారు. అంతేకాకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డిని కూడా కలిసి పా లమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఒకవేళ బీఆర్ ఎస్ ఆందోళన చేపడితే ఉమ్మడి జిల్లాలో తిరిగి గెలవడం కష్టమని తేల్చిచెప్పారు. హడావివుడిగా మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమను ఒలకబోశారు. పాదయాత్ర చేపట్టక ముందే ముఖ్యమంత్రిని జిల్లాకు రావాలని పట్టుబట్టారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది.
కేసీఆర్ హయాంలో ఇంజినీరింగ్ అద్భుతం కా ంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు పాలమూరు ఎత్తిపోతలలో భాగమైన నార్లాపూ ర్, ఏదుల, వట్టెం, ఉదండపూర్ పంప్ హౌస్ లను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు గత రెండు మూడు రోజుల నుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూ పల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గంలో మొదలయ్యే నార్లాపూర్ పంప్ హౌస్ రిజర్వాయర్‌ను చూసి ఆశ్చ ర్యపోయారని సమాచారం. కేసీఆర్ అండర్ గ్రౌండ్లో చూపెట్టిన ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఉన్నత అధికారులు వివరిస్తుంటే నోరెళ్లబెట్టారు. అంతేకాకుండా ఏదుల, వట్టెం, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లను కూడా పరిశీలించి వచ్చారు. ఎంత పని అయింది ఇంకెంత పెండింగ్ ఉంది మొత్తం ఉన్నత అధికారులు వివరిస్తుంటే మంత్రి అవాక్కయ్యారు. చివరకు ఏం చెప్పాలో తెలియక ఆయన చేస్తున్న విమర్శలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రూ.35 వేల కోట్లతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. కేసీఆర్ సీఎం హోదాలో ఈ ప్రాజెక్టుకు 2016 జూన్‌లో శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి 2023 వరకు దాదాపు 90 శాతం పనులను పూర్తి చేసి సుమారు 25 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశారు. ప్రస్తుతం కేవలం కాలువలు, లింకు కెనాల్సి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రిజ ర్వాయర్లు పంప్ హౌస్‌లు అన్నిటినీ పూర్తి చేశారు. అయి తే మంత్రి జూపల్లి ఈ ప్రాజెక్టుపై అప్పుడే అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు.
ఈ ప్రాజెక్టు లక్ష కోట్లతో చేపట్టారని కేవలం 25 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇంకా 75 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందని.. ప్రస్తుతం ప్రా జెక్టు కాస్టు పెరిగినందువల్ల మరో లక్ష కోట్లు అవస రమవుతాయని అబద్ధాలు వల్లించడం మొదలుపెట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుం టున్నారు. వాస్తవంగా గత బీఆర్ఎస్ హయాంలోనే కాలువలకు కూడా టెండర్లు పిలిచారు.. కాంట్రాక్టర్లు కూడా ఖరారై పని మొదలైవుతున్న తరుణంలో ప్రభు త్వం మారిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొత్తం టెండర్ల ప్రక్రియను నిలిపివేసి పనుల ను ఆపివేసింది. ప్రస్తుతం మంత్రి హోదాలో జూ పల్లి ప్రాజెక్టుపై తప్పుడు లెక్కలు చె ప్పడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా సర్కారు చిత్తశుద్ధితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టుతోపాటు ఇటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 నెలల తర్వాత కదలిక వచ్చింది. అటు ఏపీ ప్రభుత్వం కృ ష్ణానది నీళ్లను దోపిడీ చే స్తుంటే పట్టించుకోని రేవంత్ సర్కారు తాజాగా చేపడుతున్న బనకచర్లను అడ్డుకోలేక.. విమర్శల పాలై చివరకు పాలమూరు కు ఏదో చేస్తున్నట్లు చెప్పడానికి రెండు రో జులు పర్యటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఒక్క పాలమూరు-రంగారెడ్డి పైనే అంటే ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందని భయంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతామని ప్రకటించా రు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇతర ప్రాజెక్టులకు చిల్లి గవ్వ ఇవ్వకుండా ఎక్కడికక్కడే నిలిపివేసి.. వచ్చిన వరదలు వాడుకోకుండా వదిలేసి ప్రస్తుతం ప్రాజెక్టులపై సమీక్ష పేరుతో మరోసారి వంచించడానికి వస్తున్నారని ఉమ్మడి జిల్లా మేధావి వర్గం ఆరోపిస్తోంది. అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు బడ్జెట్లలో కావాల్సిన నిధులు కేటాయించకుండా కాలయాపన చేసి అంతా అయిపోయాక బీఆర్ఎస్ హెచ్చరికలతో దిగిరావడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రేవంత్‌రెడ్డి గురువారం, శుక్రవారం రెండ్రోజులు పర్యటించనున్నా రు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా లో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవ్వనున్నా రు. గాల్లోనే సుడిగాలి పర్యటన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనికోసం అధికారులు దాదాపు పది వర కు హెలిపాడ్లను రెడీ చేయడం ఇందుకు నిదర్శనం. సీ ఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులు ఆయన హెలికాప్టర్ ఎక్కితే మరికొందరు మంత్రులు ఇంకో హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడానికి వస్తున్నట్లు మీడియాకు సమాచారం అందించారు. మొత్తంపైన సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు రెండు హెలికాప్టర్ ద్వా రా ఉమ్మడి జిల్లా అంతా పర్యటిస్తున్నారు.
ముందుగా రేవంత్‌రెడ్డి తన కలల ప్రాజెక్టు అయిన కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సమీక్షించడానికి నేరుగా వస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో జూరాల మీదుగా కృష్ణా భీమా నదులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత గూడెం దొడ్డి దగ్గర కొద్దిసేపు ఆగి అక్కడి నుంచి నేరుగా సోమశిల కు బయలుదేరుతారు. మరుసటి రోజు కూడా హెలికాప్టర్ ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను పరిశీలించి నాగర్‌కర్నూల్ సమీపంలో కొద్దిసేపు ఉన్నతాధికారులతో సమీ క్ష జరుపుతారు. ఆ తర్వాత కరివేన రిజర్వాయర్‌కు చేరుకుంటారు. ఇక్కడే మీ డియా ప్రతినిధులతో భోజనం చేసి మా ట్లాడతారు. అక్కడి నుంచి మళ్లీ ఏరియల్ వ్యూ ద్వారా ఉదండాపూర్‌కు చేరుకొని అనంతరం జడ్చర్ల వద్ద నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.