మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 26 : రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన్మానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయామని గుర్తెరిగారన్నారు.
మహబూబ్‌నగర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పుట్టిన గడ్డ కోసం పదేండ్లు కష్టపడి హైదరాబాద్‌తో పోటీపడి అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ సహకారంతో పదేండ్ల పాలనలో పాలమూరు పట్నానికి ధీటుగా తయారైందన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలన్నీ తుం గలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేస్తుందని మం డిపడ్డారు. త్వరలోనే ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారన్నారు.
అనంతరం గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కోరమోని నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న మాట్లాడారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్లు గణేశ్, వనజ, అనంత్‌రెడ్డి, రాంలక్ష్మణ్, వేదావత్, పటేల్ ప్రవీణ్, నాయకులు ఆంజనేయులు, గిరిధర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్, సాయిలు, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, సతీష్, జావేద్, నవకాంత్, వినోద్‌కుమార్, సుధాకర్, అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.