మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 3 : ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకుండా పనిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పిలుపునిచ్చారు. బుధవా రం మహబూబ్‌నగర్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాజీ హోం మంత్రి మహమూద్అలీతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన పట్ల అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయి. ఇచ్చిన హామీల అమలు కోసం మనం ఒత్తిడి తీసుకురావాలి.
జిల్లాను బాగు చేసుకోవాలంటే ఈ ఏడాది మాత్ర మే అవకాశం ఉంది.. ఒక ఏడాది ముందు ఎన్నికల హడావుడి ఉంటుం ది.. బడ్జెట్ కేటాయింపులు పెద్దగా ఉండవు.. ఇప్పుడే హామీల అమలుకు నిధులు ఇచ్చేందుకు ఒత్తిడి తీసుకురావాలన్నారు. సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలో అత్యధిక సభ్య త్వం నియోజకవర్గంలో అయ్యేలా చూడాలన్నారు.

కాంగ్రెస్ ప్రభు త్వం చేసిన మోసా న్ని సభ్యత్వ నమోదు సమయంలో ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి క్షేత్ర స్థాయి లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నారు.
2002 తరువాత ఇప్పుడు ఓటరు లిస్ట్ సవరణ జరుగుతుంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి పేర్లు ఓటరు లిస్టులో తొలగించకుండా చూడాలన్నారు. అనంతరం మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే వరకు విశ్రమించకుండా పనిచేసి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామని, ఆ దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాల్యానాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రెహమన్, ఆంజనేయులతోపాటు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.