Srinivas Goud | ఆర్టీసీ కార్మికుల డిమాండ్లని పరిష్కారం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో బీఆర్ ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే అడుగుతున్నారు. ఒకవేళ ఆ డ్రైవర్ కు ఏమైనా జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేసుకునేందుకు కనీసం టెంట్లు కూడా వేయకుండా.. టెంట్ హౌస్ల వారిని పోలీసులు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారన్నారు.
మేము ఆర్టీసీ కార్మికులకు జీవో ఇచ్చాం.. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల అమలు చేయలేకపోయాం. మీ వల్ల రైతులు, విద్యార్థులు, మహిళలు, ఆర్టీసీ కార్మికులు ఎవరు సంతోషంగా లేరు.. మీకు సిగ్గు అనిపించడం లేదా.. పదిమంది పోలీసులను పెట్టుకుని.. వాళ్ళతో కేసులు పెట్టిస్తే.. ఎవ్వరు సహించరు. RTC కార్మికుల డిమాండ్ల పరిష్కారం చేయాలీ.ఆంక్షలు ఎత్తివేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు కూడా చెల్లించాలన్నారు శ్రీనివాస్ గౌడ్.
మీ రెండున్నర సంవత్సరాల కాలయాపన వల్ల రైతులకు అపార నష్టం జరిగింది. జూరాల ప్రాజెక్టులో జనవరిలోనే నీళ్లు లేక ఎండిపోయింది.. ఇప్పుడు కూడా శ్రీశైలం లో నీళ్లు ఎత్తి పోసుకుంటున్నాము. మేధావులు ఆలోచించాలి. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాల్వలు టెండర్లు పిలిచి.. పూర్తి చేయాలి. మీకు ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఉంది.. దయచేసి అభివృద్ధి పై దృష్టి పెట్టండని కోరారు.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video