మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 14 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ రహమత్ మసీదులో అబ్దుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై ముస్లిం మత పెద్దలకు ఖర్జూర పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదర, సోదరీమణులు తగిన జాగ్రతలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం నేతలు పాల్గొన్నారు.