గద్వాల అర్బన్, నవంబర్ 23: వివిధ చోరీ కేసు ల్లో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన అలంపూర్ మండలం ఇమామ్పూర్కు చెందిన కుర్వ సిద్ధన్న(రిటైర్డ్ అటెండర్)తన కుమారుడు జితేందర్‌తో కలిసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కారులో వచ్చారు.
అనంతరం పని ముగించుకొని కలెక్టరేట్ ఎదుట హోటల్లో భోజనం చేసేందుకు కారును లాక్‌చేసి వెళ్లారు. లాక్‌చేసిన కారు అద్దాలు పగలకొట్టి కారులో ఉన్న రూ.3.60 లక్షలను కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు శ్రీకాంత్, కల్యాణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నలుగురు నేరం చేసినట్లు గుర్తించారు.
నిందితుల కోసం నిఘా ఉంచగా అందులో ఒక్కరు(ప్రసంగి) (కప్పట్రాల తిప్ప బిట్రగుంటా గ్రామం, బోగోలు మండలం, నెల్లూరు జిల్లా) శనివారం ఉదయం ఎర్రవల్లిచౌరస్తా వద్ద మళ్లీ దొంగతనం చేసేందుకు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ చేశారు. కారులో అపహరించిన కేసు ప్రధానంగా ఉన్నట్లు గుర్తించి అతని నుంచి రూ.3.10లక్షలు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. ప్రసంగి గతంలో ఏపీలోని తిరుపతిలో చోరీ కేసులో జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు. అనంతరం మిగతా ముగ్గురు నిందితుల కోసం నెల్లూరు జిల్లాలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కేసు ను చేధించడంలో ప్రతిభ కనబర్చిన గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్‌కుమార్, గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాం త్, ఐటీకోర్ ఎస్సై రజిత, సిబ్బందిని అభినందించి క్యాష్ రివార్డ్ అందించారు.
జిల్లాలో కొంతకాలంగా నిరుద్యోగులకు రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన అంకితను గద్వాల పోలిస్లు వ్యూహాత్మకంగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెం దిన చాకలి చిన్న నర్సింహులు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయనకు సరిత అనే ప్రైవేట్ ఉపాధ్యాయురాల ద్వారా అంకిత పరిచయమైంది.
అంకిత రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పాస్తానని, నేను రైల్వేశాఖలోనే పని చేస్తున్నాని, రైల్వేశాఖలో పెద్ద అధికారులు నాకు చాలా బాగా తెలుసని నమ్మబలికించి చిన్ననర్సింహులకు వద్ద అంకిత ఆమె భర్త జగదీశ్వర్‌రెడ్డి రూ.6లక్షలు తీసుకున్నారు. నీకు ఉద్యో గం రాకాపోతే 45 రోజుల్లో నీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. చిన్న నర్సింహులు ఫిర్యాదు మేరకు ఈనెల 12వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంకిత నివాసం వద్ద పట్టుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిరుద్యోగులకు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకొని మో సం చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గద్వాల మండలంలోని వెంకంపేటకు చెందిన యువరాజ్ ఆరోగ్య శాఖలో ఓ వైద్యుడి కార్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. యువరాజ్ అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు.
అదే గ్రామానికి చెందిన అశోక్‌కుమార్, బాబు అనే ఇద్దరు యువకులకు ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మీకు ఆర్డర్ కాపీ వస్తుందని నమ్మించి నాలుగు నెలల కిందట వారి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. తీరా బాధితులు యు వరాజ్ను ఘట్టిగా నిలదీయగా చేతులెత్తేయడంతో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 28న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువరాజ్‌ను ఈనెల 16వ తేదీన తన ఇంటి వద్ద పట్టుకొని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకొన్నాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ప్రెస్మీట్లో డీఎస్పీ సత్యానారయణ, గద్వాల సర్కిల్ సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్, రజిత, సిబ్బంది పాల్గొన్నారు.