Wanaparthy | వనపర్తిటౌన్, మే 29 : వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు. ఎస్పీ, ఏఎస్పీ, ఓఎస్డీలకు ప్రత్యేక గదులతోపాటు రెస్ట్ రూంలు ఏర్పా టు చేశారు.
నేరాలను ఛేదించేలా క్రైం విభాగం, పరిపాలనా విభాగాలతోపాటు ఇంటెలిజెన్స్, డాగ్ స్కాడ్, డిజిటల్ ల్యాబ్‌లు, ట్రైనింగ్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ ల్యాబ్, పీడీ సెల్, మీటింగ్‌లు నిర్వహించేలా నాలుగు హాల్స్, ఇన్‌వార్డు, ఔట్ వార్డు, మినీ కాన్ఫరెన్స్‌హాల్, పరేడ్ గ్రౌండ్, ఆహ్లాదకర వాతావవరణంలో ఉద్యాన పార్కుతో కార్యాలయం రాజభవనాన్ని తలదన్నేలా ఉన్నది. మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయాన్ని మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీ, డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించనున్నారు. ఇందుకు సం బంధించిన ఏర్పాట్లను సోమవారం ఎస్పీ రక్షితామూర్తి పర్యవేక్షించారు.
Vanaparthi