ఉండవెల్లి, మే 31 : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న ఘటన పుల్లూర్ టోల్గేట్ వద్ద చోటుచేసుకున్నది. ఏఎస్సై సుబ్బారెడ్డి కథనం మేరకు.. ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన డ్రైవర్ కోటీశ్వరారవు ఏపీ 39యూఫ్ 8370 నెంబరు గల బొలేరో వాహనంలో నంద్యాల నుంచి 18క్వింటాళ్ల పత్తి(లూజ్) విత్తనాల లోడ్‌తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు బయలుదేరాడు. ముందస్తు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ, పోలీసు అధికారులు గురువారం రాత్రి 11 గంటలకు పుల్లూర్ టోల్గేట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈక్రమంలో 36 సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి వాటి విలువ రూ.9లక్షలు ఉంటుందని నిర్ధారించారు. సీఐ రవిబాబు ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు పంచనామా నిర్వహించి కోటీశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. నకిలీ సూత్రదారులు, విక్రయదారులెవరనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.