నాగర్కర్నూల్, మే 14: నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు. చాలాకాలంగా ప్రధాన రహదా రి పొడవునా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ముందు భాగంలో పండ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను నడుపుకొంటూ చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు.
అయితే ఆక్రమణలు చేసి వ్యాపారాలు చేస్తున్నారన్న కారణం చూపి బుధవారం వస్తు సామగ్రి ఉండగానే దుకాణాలను జేసీబీతో తొలగించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ నుంచి కొల్లాపూర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాల ముందు భాగాలు, నల్లవెల్లి రోడ్డులోని ఆక్రమణలు చేసి వ్యాపారం చేస్తున్న వా టిని తొలగించారు. మున్సిపల్ అధికారులు ఇందు లో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాల యం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డుపై ఇరువైపులా ఆక్రమణలను తొలగించారు.
చిరు వ్యాపారులు వస్తు సామగ్రి, పండ్లు, వం టివి ఉండగానే జేసీబీతో తొలగించడంతో వ్యాపారులు మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా తమ వ్యాపారాలను తొలగించడం ఏం టని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా వేశారంటూ రేకుల షెడ్లు, తడకలను పోలీ స్ బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించేశారు. ఇదిలా ఉం డగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఇంటి నిర్మాణాలు, ఆక్రమణలు చేయడంతోపాటు సెల్లార్ వంటి నిర్మాణాలు చేపట్టినవారి గురించి పట్టించుకోకుండా రోడ్డుపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న తమపై మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా వారం నుంచి ఆక్రమణలో ఉన్న వారందరూ తొలగించుకోవాలని ముందస్తు సమాచారం ఇచ్చామని, ఎవ రూ పట్టించుకోకపోవడంతోనే మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.