అచ్చంపేట, మార్చి 20 : ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 27 రోజులుగా ఆర్మీ, జి యాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, దక్షిణ మధ్య రైల్వే, అన్వీ రోబోటిక్స్, ర్యాట్హో ల్ మైనర్స్, కడావర్ డాగ్ స్వాడ్ తదితర బృందాలతో 27 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.
గురువా రం టన్నెల్ వద్ద గల కార్యాలయంలో ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్‌మిశ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమా ర్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తదితరులు సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్టీల్, మట్టిని పూర్తిగా తొలగించేందు కు సహాయక బృందాలు రోజుకు ఐదు షిప్టుల్లో ఉద యం 7, 11, మధ్యాహ్నం 3, రాత్రి 7, 11గంటల వారీగా షిఫ్ట్ పద్ధతిలో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు సాగిస్తున్నాయి.
టన్నెల్ లోపల రక్షణ ప్రమాణాలను పాటిస్తూ చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. డీ-1, డీ-2, ఏ-5 ప్రదేశాల్లో మృతదేహాల వెలికితీతకు అన్వేషణ చేస్తున్నారు. నీటి ఊట ఆటంకం కలిగిస్తుండగా.. రోబోల సేవలు అం దుబాటులోకి రాలేదు. సొరంగం చివర్లో 30మీటర్ల ప్రదేశం ప్రమాదకరంగా ఉన్నది. సాంకేతిక కారణాల వల్ల రోబోలతో సహాయక చర్యలు ప్రారంభం కాలే దు. డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మట్టి, బురద, శకలాలు బయటకు తరలిస్తున్నారు.