అచ్చంపేట, మార్చి 16 : దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతున్నది. గత 23 రోజులుగా రెస్క్యూ బృందాలు స హాయక చర్యలు చేపడుతున్నారు. డీ1, డీ 2 ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. డేంజర్ ప్రవేశంగా గుర్తించిన ప్రవేశంలో రోబో ద్వారా సహాయక చర్యలు వేగవంతం చేయడానికి అధికారులు చర్య లు చేపట్టారు. ఆదివారం దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, హైడ్రా, ర్యాట్ మైనర్స్ బృంద సభ్యులతో భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తూ, సహాయక బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను, పనికి కావలసిన సామగ్రిని, నిరంతరం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగే విధంగా సహాయక బృందాలకు పౌష్టికాహారం, తాగునీరు, మరియు మెడికల్ స పోర్ట్, సమయానికి అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమీక్ష సమావేశంలో ఆర్మీ, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రె స్పాన్స్ ఫోర్స్, ర్యాట్ మైనర్స్, కడావర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్, దక్షిణ మధ్య రైల్వే బృందాలు పాల్గొన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయ క బృందాలకు అందిస్తున్న వసతి సదుపాయాలను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. దోమలపెంటలోని జెడ్పీహెచ్ఎస్, యూపీఎస్, స్పోర్ట్స్ క్లబ్, ఈగలపెంటలోని జిమ్ సెంటర్, కళాభారతి, పటేల్ హాల్, ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మార్పులను కలెక్టర్ అధికారులకు సూచించారు. సహాయక బృందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.