గోపాల్పేట, ఏప్రిల్ 10 : గుత్తేదారుల మేలు కోసం.. కమీషన్లకు కక్కుర్తి పడి కాంగ్రెస్ సర్కారు ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గురువా రం ఏదులలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొడ్ల రాములు అధ్యక్షతన ఈనెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ని రంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కా గా, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పటాకులు కాల్చి, కోలాటాలు, మహిళల బొడ్డెమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. అ నంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడానికి రూ.100కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వొచ్చని, అవగాహన లేక గుత్తేదారులకు లబ్ధిచేకూరుస్తూ కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుంచి రైతుల భూములకు న ష్టం కలిగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రూ.1,800కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అదేవిధంగా గుత్తేదారుల కోసం గొల్లపల్లి రిజర్వాయర్‌కు ప్రతిపాదన పంపారన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా ఏదుల రిజర్వాయర్ కేసీఆర్ ఆశీర్వాదంతో పూర్తి చేశామని, అదేవిధంగా కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువును పారద్రోలేందుకు రూ.600కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడలేని మంత్రి జూపల్లి, శాసన సభ్యులు ఇందుకు బాధ్యత వహించాలన్నారు.
నిబద్ధతతో ప్రజలకు మేలు చేసేందుకు కేసీఆర్‌ను ఒప్పించి ఏదులను మండలంగా ఏర్పాటు చేయించి అభివృద్ధి చేశామని, మంది చేసిన పనులకు కాంగ్రెస్ నాయకులు మంగళహారతులు పడుతూ ఉన్న నీళ్లను తరలించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటవుతుందన్న కనీస ఙ్ఞానంలేని కాంగ్రెస్ నేతలు తాము మండలం తెచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మంచి చేసే కేసీఆర్‌ను కాదనుకొని ఎంత నష్టపోతున్నారో ప్రజలకు అర్థమైందని, స్థానిక సంస్థల్లో రేవంత్‌రెడ్డి సర్కారుకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలన ప్రశ్నిస్తూ, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నేత నాగం తిరుపతిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్, మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచులు ఇందిర, రమేశ్, సునీల్, లాల్‌సింగ్, నాయకులు కృపాకర్‌రెడ్డి, సుల్తాన్, ప్రవీణ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, ఉస్సేన్, విజయ భాస్కర్‌రెడ్డి, స్వామి, బాల్‌రెడ్డి, విష్ణు, తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవల్లి, ఏప్రిల్10 : కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడేవారికి రానున్న కాలంలో ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీ ఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ నేత వాకిటి శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ భీమ య్య, మాజీ ఎంపీపీ సేనాపతి, మాజీ వైస్ ఎంపీపీ మధు సూదన్‌రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.