వనపర్తి, మార్చి 21(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత మాయ, మోసం, వంచన చేస్తూ ప్రజలను నిలువునా ముంచేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దేశంలోనే అధిక మోసపూరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ ప్రభు త్వం నెంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎద్దేవా చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయింపులే లేనప్పుడు ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇక వారు ఇచ్చేది రెండు బ డ్జెట్లే.. ఇప్పటికే సింహభాగం పాలన ముగిసిన ట్లే.. మిగిలిన రెండు బడ్జెట్ల్లో చివరిది ఎన్నికల బడ్జెట్.. ఇకపోతే మిగిలింది ఒకే ఒక్కటన్నారు.
ఇచ్చిన హామీలకు కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఆశించారని, తీరా చూస్తే నిరాశ క ల్పించి.. మళ్లా ఆహో.. ఓహో అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్‌పై కుంటిసాకులు చెప్పి అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో కేటాయింపులు చేసిందన్నారు. బీసీలపై ప్రేమ వలక బోసి భ్రమలు కల్పించే ప్ర యత్నం కాంగ్రెస్ చేసిందని, ఇందుకు బడ్జెట్లో బీసీ వర్గాలకు కేటాయించిన నిధులే నిదర్శనమన్నారు. కనీసం రూ.50 వేల కోట్లు బీసీలకు ప్రభుత్వం కేటాయించి నిబద్ధతను చాటుకోవాల్సి ఉండిందన్నారు. హైదరాబాద్‌ను కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేసిన ప్రత్యేకంగా హైదరాబాద్‌కు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దేశంలోనే నాలుగో మహా నగరంగా భాగ్యనగరానికి పేరుందని, ఇప్పుడేదో సిటీ నిర్మాణం చేసి ప్రత్యేకంగా సమకూర్చేదేమీ లేదన్నారు.
తెలంగాణకు హైదరాబాద్ అక్షయ పాత్రలాంటిదని, ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ బద్ధలు కొట్టిందని దుయ్యబట్టారు. మూడేళ్ల పాలనలో రూ.3లక్షల కోట్ల అ ప్పు చేసి కనీసం ఇచ్చిన హామీలకు కేటాయింపు లు లేవని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు గంగలో కలిశాయని, హామీల అమలుకు ఏమా త్రం అవకాశం లేని బడ్జెట్ అన్నారు. ప్రజలకు పంగనామాలు పెట్టడంలో కాంగ్రెస్ సర్కారు హ్యాట్రిక్ సాధించిందన్నారు. రైతు భరోసా వచ్చిన వాళ్లకే రైతుబీమా అంటూ మెలికలు పెడుతున్నారని, పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టినట్లే బీమా పథకానికి మంగళం పాడాలనే ఎత్తుగడ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాం లో రాష్ట్రంలో లక్ష మంది రైతులకు బీమా సౌక ర్యం కల్పించామని, గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఇచ్చామని గుర్తుచేశారు.
రిటైర్డ్ ఉద్యోగులను నానా యాతన పెడుతున్నారని, చివరకు లెటర్లు రాసి ప్రాణాలు కోల్పోతున్నా.. వారి సొ ంత డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. పీఆర్సీ అమలు, 5 డీఏలు సైతం పెండింగ్‌లో పెట్టి ఆశలను అడియాశలుగా మార్చిందన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అం టూ మూడేండ్లయినా 11వేలు మాత్రమే భర్తీ చే సి ఇదిగో.. అదిగో అంటూ గోస పెడుతున్నారని ఆరోపించారు. ఇంకా భారీ ప్రాజెక్టులంటూ మో సం చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మే స్థితి లో లేరన్నారు.
ఆశపడి కాంగ్రెస్‌ను గద్దెనెక్కించిన ప్ర జలకు ఈ మూడేళ్లలో భ్రమలు తొలగిపోయాయని, ఇక మిగిలిన వారికి ఈ రెండేళ్లలో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు కృష్ణానాయక్, నర్సింహ, అశోక్, పరంజ్యోతి, రాము లు, బాలరాజు, కర్రెస్వామి, ధర్మానాయక్, నారాయణ నాయక్, హుస్సేన్, మహేశ్వర్‌రెడ్డి, రాము, రమేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.