వనపర్తి టౌన్, జూలై 12 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ విధానాన్ని ఆదివారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో ఉన్న ఓటర్లందరిని ప్రత్యక్షంగా కలిసి జరుగుతున్న సర్ విధానాలపై అవగాహన కల్పించి తుది డ్రాప్టింగ్‌లో కచ్చితంగా ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు దగ్గరుండి ఓటరు నమోదు పత్రాలను తప్పులు లేకుండా పూరించి ప్రజలకు సహకరించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటూనే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బీఎల్వోలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, అశోక్, మాణిక్యం, భానుప్రకాశ్ రావు, సర్పంచ్ శోభా కృష్ణయ్య, రఘువర్న్రెడ్డి, మాధవ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిట్యాల రాము, బాబు నాయక్‌తో పాటు బీఎల్వోలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్ గణన ప్రక్రియ సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు ఆదివారం సంబంధిత వార్డు బీఎల్వో మాలతికి , రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు తమ కుటుంబ సభ్యుల ఫారాలను అందజేశారు. ప్రతిఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాలను తప్పకుండా బీఎల్వోలకు అందజేయాలని మాజీ మంత్రి ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, నాయకులు వెంకటసాగర్, నీలస్వామి, రవిప్రకాశ్‌రెడ్డి, సయ్య ద్ జమీల్, భాగ్యరాజ్, హే మంత్కుమార్, క్రాంతి, తోట శ్రీను పాల్గొన్నారు.