Raaka | ‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో కొత్త షెడ్యూల్‌కు సిద్ధమైన అట్లీ!
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా చిత్రం రాకా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పుడు కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరించనుంది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా చిత్రం రాకా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పుడు కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరించనుంది. ఈ సీన్‌ను సినిమాకే హైలైట్‌గా నిలిచేలా అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్‌తో బన్నీ ఎంట్రీ ప్రేక్షకులకు గూస్బంప్స్ ఇచ్చేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటివరకు కనిపించని వైల్డ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్లో ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని సమాచారం. ‘పుష్ప’ తర్వాత మరోసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో బన్నీ కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘రాకా’లో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో భాగం కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘రాకా’ కథ మాఫియా ప్రపంచం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ శక్తివంతమైన డాన్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ మలుపులతో కథ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అట్లీ తన గత చిత్రాల మాదిరిగానే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టార్డమ్, అట్లీ మాస్ టేకింగ్, భారీ తారాగణం, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కలిసి ‘రాకా’ను ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలబెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

