పాట్నా: బీహార్‌లోని సివాన్ జిల్లాలో జూలై 25వ తేదీన బీహార్ బంద్ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో విద్యార్థులపైకి ఫైరింగ్ జరిపారు. బీహార్ పోలీసు ప్రధానకార్యాలయం ఆ ఘటన పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిరసనకారులపై ఏకే-47తో ఫైరింగ్‌కు పాల్పడిన ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనేక జిల్లాల్లో విద్యార్థులు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. గాయపడ్డ ముగ్గురి విద్యార్థులు ప్రస్తుతం పాట్నాలోని జయప్రభ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 ఏల్ల ఆరిఫ్ అనే వ్యక్తి కాల్పుల్లో గాయపడ్డాడు. షాపు నుంచి తిరిగి వస్తున్న సమయంలో అతని మెడలో బుల్లెట్ దిగింది. అయితే డాక్టర్లు సర్జరీ చేసి విజయవంతంగా ఆ బుల్లెట్‌ను తీశారు. బీహార్‌లోని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కానిస్టేబుల్ ఫైరింగ్‌కు చెందిన వీడియోను ఒకటి ఆన్లైన్లో పోస్టు చేశారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ఢిల్లీలో విద్యార్థులపై కూడా పెల్లెట్ గన్స్ వాడారని, బీహార్‌లో ఏకే-47 వాడినట్లు ఆయన ఆరోపించారు.
सिवान में छात्र प्रदर्शन के दौरान पुलिस ने छात्रों पर सीधी फायरिंग की। AK-47 से भी फायरिंग की गई।
जब 7 हत्याओं का आरोपी अपराधी मुख्यमंत्री बन जाए तब लोकतंत्र में प्रदर्शन कर रहे निर्दोष छात्रों पर पुलिस ऐसे ही गोलियां चलाती है। दोषी अधिकारियों के खिलाफ कार्रवाई हो। #Bihar pic.twitter.com/RB2Ftc1xeS
— Tejashwi Yadav (@yadavtejashwi) July 25, 2026