నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30 లోపు 15రోజులపాటు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిస్తూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాస్‌పోర్టును వాపస్ చేసింది. పర్యటన ముగిసిన తర్వాత పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని, కోర్టు ఎదుట హాజరుకావాలని షరతులు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు యూరప్‌లోని బంధువుల మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ వివరాలను జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు.