IIT Kharagpur | ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎంటెక్ కోర్సులో 2026-27కు సీట్లను పెంచింది. ఈ సీట్లను ‘ప్లాటినం జూబ్లీ పథకం’లో భాగంగా పెంచినట్లు కాలేజీ యాజమాన్యం ‘X’లో వెల్లడించింది. దీంతో ఎంట్రన్స్ పరీక్ష గేట్లో అర్హత సాధించిన అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) 75వ స్నాతకోత్సవ జూబ్లీ వేడుకలను జరుపుకొంటుంది. ఈ సందర్భంగా ప్లాటినం జూబ్లీ పథకాన్ని ప్రారంభించింది. నైపుణ్యం కలిగిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు సీట్లు పెంచామని తెలిపింది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలకు చెందిన విభాగాల్లో ఈ సీట్లను పెంచారు.
ఈ అదనపు సీట్లకు సాధారణ ఎంటెక్ ప్రవేశాల మాదిరిగానే తీసుకుంటారు. వ్యాలిడ్ కలిగిన గేట్ స్కోర్ ఉన్న వీటికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏదైనా ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో 8 లేదా అంతకంటే సీజీపీఏ (CGPA) సాధించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు
ఐఐటీ ఖరగ్‌పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మెకానిక్ లెర్నింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ టెక్నాలజీ, క్రయోజెనిక్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఇండిస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఎర్త్ సిస్టమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదిరత కోర్సులను ఎంటెక్‌లో అందిస్తుంది.
కాలేజీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గేట్ అర్హత సాధించి ఐఐటీలో ఎంటెక్ చేయానుకునే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అడ్మిషన్ల సమాచారం కోసం కాలేజీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి.