వనపర్తి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి సర్వనాశనం పట్టించడం ఖాయమని నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సమావేశం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మా ట్లాడుతూ అలివిగాని హామీలతో ఎన్నికల్లో గెలిచి న రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచాడన్నారు.
గతంలో చాలా ఏండ్లు కాంగ్రెస్ పాలన చేసిందని, ఇదే పార్టీలో అన్ని హామీలను మోసం చేసిన ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచాడన్నారు. కాంగ్రెస్‌కు కొద్దోగొప్పొ ఉన్న పేరును పూర్తిగా సర్వనాశనం చేసేదాకా రేవంత్ వదలడన్నారు. యూరియా బస్తా కోసం చెప్పులను లైన్లో పెట్టి రైతును గోస పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవడం తథ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం చెప్పులు లైన్లో పెట్టి రైతులు రాత్రిపగలూ నిరీక్షించినా యూరియా అందడం లేదని ఆయన గుర్తు చేశారు. యాప్ పేరు చెప్పి రైతులను గందరగోళం చేస్తూ తికమక పెడుతున్నదని, దీంతో అన్నదాతలు కలవర పడుతున్నారన్నారు. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ అయినా కాంగ్రెస్ సర్కారు ఇచ్చిం దా అని ఆయ న ప్రశ్నించారు.
మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం ఇచ్చి పురుషులతో డబుల్ చార్జీ వసూలు చేస్తున్నాడని దీన్ని మహిళలు గుర్తించాలన్నారు. వనపర్తిలో తన హయాంలో 90 శాతం రోడ్ల విస్తరణ పూర్తిచేయగా మిగిలిన పదిశాతం రెండేళ్లు గడిచినా చేయడానికి చేతకావడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కు ఓట్లేస్తే..ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయదని, ఇది గుర్తుంచుకొని ఓట్లు వేయాలని ఆయన కోరారు. భవిష్యత్‌లో మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేందుకు మున్సిపల్ ఎన్నికల విజయం ఓ మెట్టుగా పని చేస్తుందన్నారు. రా ష్ట్రంలో ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ఇదే సందర్భంలో వచ్చిన మున్సిపల్ ఎన్నికలను ప్రజలు ఉపయోగించుకొని కాం గ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని సింగిరెడ్డి కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మరో ఐదేళ్లు ఘోస పడతారని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. పింఛన్లు, రైతుబంధు, రుణమాఫీ, మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మిలో తు లం బంగారం అంటూ ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. బంగారం పేరు చెప్పిన రేవంత్‌రెడ్డి కనీసం రాగి ఉంగరం కూడా ఇవ్వలేదని, మళ్లీ ఏమొఖం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాంగ్రెస్ వాళ్లు వస్తారని స్వామిగౌడ్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అబద్ధాలతో మోసం చేశారని, ఇప్పటికైనా ఓటర్లు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ముగింపు సమావేశానికి ప్రజలు భారీగా తరలిరావడంతో గులాబీ శ్రేణులు సంబురపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా మృతశిలలా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు మరచి ఏమాత్రం ప్రజల సంక్షే మం పట్టని రాష్ట్ర ప్రభుత్వం మృతశిల (జీవం లేని రాయి) లాంటిదని..అది ఉన్నా లేకున్నా ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన పెబ్బేరు మున్సిపాలిటీలో పర్యటించి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పల్లెలు, పట్టణాల్లో గత బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందాయి తప్పా ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఆయన విమర్శించారు.
దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాం కొనసాగితే.. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వలేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతున్నదని విమర్శించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హ యాంలోనే వేసిన నోటిఫికేషన్లతో వీళ్లు 40వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు.
కొత్తగా 10వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకోవడం శోఛనీయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని, ఈ ఎన్నికల వల్ల బీజేపీకి లాభం జరగదని అన్నారు. బీఆర్ఎస్కు ఓటేయడం ద్వారా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పి ప్రజాసామ్యాన్ని నిలబెట్టినట్లవుతుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో పెబ్బే రు మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త కర్రెస్వామి, ఎన్నికల ఇన్చార్జి లక్ష్మారెడ్డి, నాయకులు రాములు, జగన్నాథం, రాజశేఖర్, ఆంజనేయులుసాగర్, రమేశ్, భారతి పాల్గొన్నారు.