మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జూన్ 12 : కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. బడి గంట మోగినా పలు పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కరువయ్యాయి. శిథిలావస్థలో పలు భవనాలు దర్శనమిస్తున్నాయి. ఉపయోగించలేని దుస్థితిలో టాయిలెట్లు, తాగేందుకు కరువైన నీళ్లు.. ఆవరణల్లో ఆటలు ఆడేందుకు వీలు లేకుండా వర్షపు నీళ్లు.. విరిగిన బేంచీలు.. ప్రమాదకరంగా పైకప్పులు.. గోడల్లో పెరుగుతున్న చెట్లు.. ఇలా ఒక్కటేమిటీ పలు సవాళ్లు విద్యాశాఖ ముందు ఉన్నాయి. తొలి రోజు పలు చోట్ల బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్ పడగా.. మధ్యాహ్న భోజనం లేక పలువురు విద్యార్థులు పస్తులు ఉన్నారు. ఇక బడిబాట కానరాక.. ఉపాధ్యాయుల ఇంటి బాట మాత్రం కనిపించింది. కొన్ని చోట్ల విద్యార్థులతో పనులు చే యించారు. మొత్తానికి మొదటి రోజు తడ‘బడింది
పాఠశాలల పునః ప్రారంభంలోనే విద్యాశాఖాధికారుల ఆలసత్వం స్పష్టంగా కనిపించింది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం చేరాలని ప్రభుత్వం ఆదేశించినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో దాదాపు మూడువేలకు పైగా యూనిఫాంలు అవసరం ఉండగా, కేవలం పదిహేను వందల దుస్తులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. మండలంలో 89 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, పలు పాఠశాలలు అరకొర వసతులతోనే ప్రారంభమయ్యాయి. అటెండర్లు, స్వీపర్లు లేక విద్యార్థులతోనే పాఠశాలలను శుభ్రం చేయించారు. ఎర్రసత్యం, గాంధీ చౌరస్తా ప్రైమరీ స్కూళ్లల్లో టీచర్లు, విద్యార్థులు కలిసి తరగతి గదులను శుభ్రం చేశారు. కోడ్గల్ జెడ్పీ హైస్కూల్లో అల్పాహారానికి బ్రేక్ పడింది.
తెరచుకోని వంటగది
నాగర్‌కర్నూల్, జూన్ 12 : పాఠశాలల పున:ప్రారంభం పండుగ వాతావరణంలో ఉండాలనే ప్ర భుత్వ ఆదేశాలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ టీచర్లు బేఖాతరు చేసి విద్యార్థులు పస్తులుండేలా చేశారు. మొదటిరోజు మధ్యాహ్న భోజనం వండిపెట్టే గది తెరుచుకోలేదు. దాదాపు 800కు పైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో మొదటిరోజే మధ్యాహ్న భోజనం వండలేదు. నాగర్‌కర్నూల్ పట్టణంతోపాటు మున్సిపల్ పరిధిలోని గ్రామాలు, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యను అభ్యసిస్తున్నా రు. కాగా వంట చేసేందుకు వచ్చిన వంటమనిషి ఫాతిమాతోపాటు వంట చేసేవారు గది తాళంచెవి లేకపోవడంతో బయటే ఉండిపోయారు. మొదటిరోజు అయినప్పటికీ దాదా పు 100 మందికిపైగా విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. వారందరికీ మధ్యా హ్నం భోజనం పెట్టాల్సిన వంట ఏజెన్సీవారు భోజనశాల తెరవకపోవడం విశేషం. ఈవిషయమై డీఈవో గోవిందరాజులును వివరణ కోరగా మొదటిరోజు కావడంతో తక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనాన్ని మరో పాఠశాలలో ఏర్పాట్లు చేశామని, రేపటి నుంచి అదే పాఠశాలలో వంట ఏజెన్సీ వారు భోజనం చేసి పెడతారని వివరణ ఇచ్చారు.
కుర్చీల మోత
మిడ్జిల్, జూన్ 12 : పాఠశాలలు ప్రారంభమై న తొలిరోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. గత ప్రభుత్వం నిర్వహించిన మ న ఊరు-మన బడి కార్యక్రమాన్ని నేటి కాంగ్రెస్ సర్కారు అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మా ర్చి నిధులు మంజూరు చేసింది. తరగతి గదుల కు రంగులు వేయడం, మరుగుదొడ్ల మరమ్మతు లు, తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు వంటి మరమ్మతులు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించినా మండలంలోని పలు పాఠశాలల్లో పను లు పూర్తి కాలేదు. మండల కేంద్రంలోని హైస్కూల్‌కు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే వచ్చారు. వ చ్చిన వారితోనే ఉపాధ్యాయులు కుర్చీలు మో యించి తరగతి గదులకు మామిడి తోరణాలు క ట్టించారు. అయితే ఏ పాఠశాలలోనూ విద్యార్థులకు అల్పాహారం అందించలేదు.
అస్తవ్యస్థంగా..
కొల్లాపూర్, జూన్ 12 : విద్యాసంవత్సర ప్రా రంభం విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల సంగతి ప క్కకు పెడితే మొదటి రోజే ప్రభుత్వ పాఠశాలల్లో భయంభయంగా చదువులు ప్రారంభయ్యాయ ని చెప్పవచ్చు. మంత్రి ప్రాతినిథ్యం వహించే కొ ల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల లు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. మం డల పరిధిలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాల శి థిలావస్థకు చేరింది. కానీ ఇందులోనే నూతన విద్యాసంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యా యి. వరుసగా కురుస్తున్న వర్షాల దాటికి విద్యార్థులే కాదు పాఠశాలలో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ముక్కిడిగుండం ప్రభుత్వ పాఠశాలలో 8వతరగతి వరకు క్లాసులు ఉన్నాయి. 160 మం ది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 70 మందికి పైగా విద్యార్థినులు ఉన్నా ఒక్క మూత్రశాల కూ డా లేకపోవడంతో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి.
ఎక్కడికక్కడే పెండింగ్..
నవాబ్‌పేట, జూన్ 12 : మండలంలోని వివి ధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలు బుధవారం సమస్యలతో స్వాగతం పలికాయి. పల్లెగడ్డ పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులు నేటికీ పూర్తి కాలే దు. కామారం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు హాజరు కాగా వారితోనే ఉపాధ్యాయులు శుభ్రం చేయిస్తున్న దృశ్యాలు కనిపించాయి. నవాబ్‌పేటలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ అనంతయ్య ఏకరూప దుస్తులు, నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. చాలా గ్రామాల పాఠశాలలకు ఏకరూప దుస్తులు పూర్తిస్థాయిలో అందలేదు. అలాగే అమ్మ ఆదర్శ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యలు ఫుల్..
గద్వాలటౌన్, జూన్ 12 : వేసవి సెలవులు ముగియడంతో బుధవారం జిల్లాలోని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పండుగ వాతావరణం కనిపించేలా కొ న్ని పాఠశాలలను అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ముఖ ద్వా రాలకు మామిడాకులు, కొబ్బరి మట్టలతో అందంగా తీర్చిదిద్దారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కాలేదు. విద్యార్థులు పాఠశాలకు రాకముందే వసతులు కల్పించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు త గ్గట్లు కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారు. ప్రభు త్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో బాత్రూంల నిర్మా ణం అసంపూర్తిగా ఉన్నది. దీంతో విద్యార్థులు బహిరం గ ప్రదేశాలకు వెల్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్టుగా బాత్రూం వ్యవస్థ లేదు. అలాగే అనేక పాఠశాలల్లో బాత్రూం వ్యవస్థ సరిగ్గా లేకపోవడాన్ని అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్య లు చేపట్టిన దాఖలాలు లేవు.
మొదటి రోజే పనులు..
మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పుస్తకాలు అందిచాల్సిన ఉపాధ్యాయులు చీపుర్లు అందించారు. పాఠాలను తిరగేయాల్సిన చేతులకు చెత్తను శు భ్రం చేసే పని అప్పగించారు. బాలకార్మిక వ్యవస్థను ని ర్మూలించాలని ఉపన్యాసాలిచ్చే ఉపాధ్యాయులు బాలకార్మిక నిర్మూలన దినోత్సవాన విద్యార్థులతో పనులు చేయించడం ఎంతవరకు సబబో వారికే తెలియాలి.
అందని అల్పాహారం
పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించాల్సిన బ్రేక్ ఫా స్ట్‌కు నారాయణ పేట జిల్లాలో బ్రేక్ పడింది. అధికారుల అలసత్వం ఏమో గానీ.. విద్యార్థులకు అందించాల్సిన అల్పాహారాన్ని అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిమాదిరిగానే పాఠశాలకు వెళ్తే టిఫిన్ అందుతుందని భావించిన విద్యార్థులు చాలామంది వారి ఇంటి వద్ద చేయకుండానే పాఠశాలకు వచ్చారు. తీరా అక్కడ లేకపోవడంతో పస్తులతోనే మధ్యాహ్నం వరకు గడిపారు. మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తరగతి గదులకు వెళ్లారు. మొదటి రోజు కావడంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేదు. జిల్లాలో ఆరు హై స్కూళ్లు, యూపీఎస్, 15 ప్రాథమిక పాఠశాలలు, 319 జెడ్పీ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 జెడ్పీ హైస్కూళ్లు, 11 కేజీవీబీలు, 2 మోడల్ హైస్కూళ్లు, 13 గురుకులాలు, నాలుగు ఎ యిడెడ్ పాఠశాలలలో కలిపి 58,896 మంది విద్యార్థులు ఉండగా.. మొదటి రోజు కేవలం 12,595 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
వానొస్తే కూలుడే..
మాగనూరు, జూన్ 12 : ప్రభుత్వం ఏటా పాఠశాల భవనాల మరమ్మతుకు నిధులు విడుదల చేస్తోంది. కానీ సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వ ఆశయానికి గండి పడుతున్నది. మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను 2011లో నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఆ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొన్నది. పాత గ్రంథాలయం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకొని పెచ్చులూడుతున్నాయని.. భారీ వర్షాలు కురిస్తే ఏ క్షణమైనా కూలే అవకాశం ఉన్నదని గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే వర్కూర్, మాగనూర్, వడ్వాట్, అమ్మపల్లి గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పెండింగ్‌లో పనులు..
మానవపాడు, జూన్ 12 : మండలంలోని 26 పాఠశాలలకు 4 పాఠశాలలు మినహా ఏ ఒక్క బడిలో కూడా విద్యార్థులు హాజరు కాలేదు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనీసం ఒక్క విద్యార్థి హాజరు కాలేదంటే ఉపాధ్యాయుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకో
వచ్చు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ఈ నెల 6 నుంచి బడిబాట ప్రారంభించిన ఉపాధ్యాయులు మొదటి రోజు తిరిగి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. మొదటి రోజు ఒక్క జల్లాపురం ఉన్నత పాఠశాల మినహా ఏ ఒక్క పాఠశాలలోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించలేదు. అలాగే చాలా పాఠశాలల్లో మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉండడంతో తొలిరోజే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నత్తనడకన అమ్మ ఆదర్శ పాఠశాలలు
ఈ విద్యా సంవత్స రం ప్రారంభంలోనే సర్కారు బడులు సమస్యల తో స్వాగతం పలుకుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి మండలంలో 38 పాఠశాలలు ఎంపిక కా గా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు. మండలవ్యాప్తంగా 4,500మంది విద్యార్థు లు సర్కారు బడుల్లో చదువుతున్నారు. అయితే ఒక్కో వి ద్యార్థికి రెండుజతల యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉండ గా.. ప్రస్తుతం ఒక్క జతనే ఇస్తున్నారు. మరో జత అందించేందుకు బట్ట రాలేదని అధికారులు చెబుతున్నారు.