ఊట్కూర్, మార్చి 30 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలిస్త్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు ట్రాక్టర్ యజమానులతో కుమ్మకై సరిహద్దు పొలాల్లో ఇసుకను డంప్ చేయించి వారి వద్ద కొనుగోలు చేసిన ఇసుకను టిప్పర్ల ద్వారా నారాయణపేట జిల్లాకేంద్రంతో పాటు మక్తల్ నియోజకవర్గంలోని పరిసర గ్రామాలకు తరలించి రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు.
ఊట్కూర్, అమీన్పూర్, తిప్రాస్పల్లి, సంస్థాపూర్, నాగిరెడ్డిపల్లి, కొల్లూరు శివారు గ్రామాల పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక వ్యా పారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. గ్రామాల్లోని వ్యాపారుల వద్ద ట్రాక్టర్ ఇసుక ధర రూ. 2000 నుంచి రూ. 2500 కొనుగోలు చేసి ఇసుకను టిప్పర్లతో పట్టణాలకు తరలిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇసుక రవాణా సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ఇసుక మాఫియా అడ్డదారిలో తరలించిన ఇసుకను టిప్పర్ ధర రూ. 20వేల నుంచి రూ. 22వేలు తక్కు వ ధరకు విక్రయించడంతో నిర్మాణదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేడుతున్నారు.
కాగా, ప్రభుత్వం, మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇసుకను తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో గస్తీ సమయంలో మాత్రమే పోలీసులు తమకు కనిపించిన వాహనాలను అడ్డుకొని నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. మిగ తా సమయాల్లో అధికారు లు, పోలీసులు పెద్దవాగు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంతో అక్రమార్కులు ఇష్టారీతిన ఇసుకను కొల్లగొట్టి కాసులు గడిస్తున్నారు.
అడ్డు అదుపు లేకుండా పెద్దవాగు నుంచి ఇసుకను తరలించడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, వరి పైర్లకు సాగు నీరు అందక ఎండిపో యే ప్రమాదం ఉందని వాగు పరివాహక ప్రాంత రై తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క భూగర్భ జలాలు ఇంకిపోయి సాగు, తాగు నీటికి ప రివాహక గ్రామాల ప్రజలకు ఇబ్బందు లు తప్పవని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పెద్దవాగుపై దృష్టి సారి ంచి అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన కొంద రు అధికార పార్టీ నేతలు నయా ఇసుక దందాకు తెర తీశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఎద్దుల బండ్లను ఆసరాగా చేసుకుని భారీగా ఇసుకను డంపు చేస్తున్నారు. గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి ఎడ్ల బండ్లపై ఇసుకను తరలించి గ్రామ శివారులో డంప్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఎద్దుల బండ్లపై తీసుకొచ్చి డంప్ చేసిన ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ యజమాలకు విక్రయిస్తున్నారు.
పెద్ద వాగు నుంచి ఎద్దుల బండ్ల సాయంతో తరలించి న ఇసుకను గృహ నిర్మాణాలు, ఇ తర కన్స్ట్రక్షన్ నిర్మాణం పనులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొల్లూరు ను ంచి నాగిరెడ్డిపల్లికి వెళ్లే ర హదారి పక్కన పొలం లో పెద్ద మొత్తంలో ని ల్వ చేసిన ఇసుక డ ంపులను స్థానికుల ఫిర్యా దు మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఇ ప్పటికైనా అధికారులు స్పం దించి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతు