అచ్చంపేట, ఏప్రిల్ 9 : సాహసోపేతమై దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు వేళైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలోని లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 11 నుంచి 13 వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది పండుగ తర్వాత తొలి చైత్ర పౌర్ణమికి జాతర జరుగుతుంది. ఈ మూడ్రోజులు ఇక్కడ చెంచులే పూజారులుగా అరుదైన ఉత్సవం జరగనున్నది. తెలంగాణ నుంచే గాక ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. వచ్చే భక్తులు వస్తున్నాం.. లింగమయ్యా.. అంటూ.. తిరిగి వెళ్లే స మయంలో వెళ్తున్నాం.. లింగమయ్యా.. అన్న నినాదాలతో అడవి పులకించనున్నది.
ఇక్కడ జలపాతానికి సందర్శకులు, భక్తులు ముగ్ధులు కావాల్సిందే.. ఇక్కడే ఉన్న గుండంలోని నీరు చల్లగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిందని భక్తులు బాటిళ్లలో నింపుకొని వెళ్తుంటారు. అలాగే కింద ఉన్న గుహలో కూడా లిం గమే ఉండగా.. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. జాతరకు అధికారులు అ న్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆధ్యాత్మిక భావనతో పా టుగా ట్రెక్కింగ్ మాదిరి వేయి అడుగుల లోతుకు కా లినడకన చేరుకునే ఆహ్లాదకర అనుభూతిని ఈ యా త్ర మిగిల్చనున్నది. అయితే ఉదయం 6 గంటల నుం చి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.
సలేశ్వరం జాతర.. ఎంతో సహసంతో లింగమయ్య దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలం -హైదరాబాద్ వెళ్లే రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో రాళ్లు, రప్పలు, లోయలోకి దిగి వెళ్లాల్సి ఉం టుంది. జాతరకు వెళ్లడానికి వాహన సౌకర్యం ఉండ దు. శ్రీశైలం క్షేత్రానికి 60కిలోమీటర్ల దూరంలో ఉం టుంది. అడవిలో ఫరహాబాద్ మీదుగా 30 కి.మీ. వాహన ప్రయాణం.. అక్కడి నుంచి 5 కి.మీ. కాలినడకన వెళితే.. అక్కడ లోయలోని గుహలో ఈశ్వరుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు.
హైదరాబాద్ నుంచి 130 కి.మీ., మహబూబ్‌నగర్ నుంచి 100 కి.మీ., నల్లగొండ నుంచి 150 కి.మీ. దూరం ప్రయా ణం చేశాక మన్ననూర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 15 కి.మీ. దూరంలోని ఫరహాబాద్ మీదుగా 30 కి.మీ. వెళ్లాక రాంపూర్పెంటకు.. అక్కడి నుంచి మరో 2 కి.మీ. ఆటోల ద్వారా.. మరో 2 నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది. మరో మార్గమైన లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా కూడా ట్రాక్టర్లు, కాలినడకనతో సలేశ్వరం చేరుకోవచ్చు. ఎమరుపాటుగా కాలు జారితే ఇక లోయలో పడిపోవాల్సిందే.
సలేశ్వరం జాతరకు 11 నుంచి 13వ తేదీ వరకు మూడ్రోజులే అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుం చి సాయంత్రం 6 గంటల వరకు ఫరహాబాద్ నుంచి అనుమతి ఇస్తాం. పార్కింగ్ పుల్లాయపల్లి వద్దనే పోలీసులు ఆపేస్తారు. అక్కడి నుంచి రాంపూర్ వరకు ఆటోలు, జీపుల్లో వెళ్లాలి. వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వా డకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడం నిషేధం. అ నారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింత లు, చిన్నారులు దూరంగా ఉండాలి. భక్తుల సౌకర్యార్థం 450 మంది సిబ్బంది, వలంటీర్లను ట్రా ఫిక్ నియంత్రణ, టోల్గేట్ వద్ద, చెత్త సేకరణ కో సం నియమించాం. అత్యవసర అంబులెన్స్‌కు ప్ర త్యేక దారిని ఏర్పాటు చేశాం. 2 లీటర్ల వాటర్ బా టిల్స్కు అనుమతి.. లీటర్ బాటిళ్లకు లేదు.
-డీఎఫ్‌వో రోహిత్ గోపిడి
జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. మా తాతాల కాలం నుంచి ఆదివాసిలే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఆగర్లపెంటలకు చెందిన వారు పూజారులు.. లింగమయ్యకు ఇప్పపూలు, తేనే నైవేద్యంగా సమర్పిస్తాం. స్వామి దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో రావాలి. ఎవరైనా మటన్, మందు తాగి వస్తే తేనెటీగలు వాసన పసిగట్టి దాడిచేస్తా యి. భక్తులు అలర్ట్‌గా ఉండాలి.. గుండంలోపల జనరేటర్ ద్వారా లైట్లు ఏర్పాటు చేశాం. గజ ఈతగాళ్లు ఉందుబాటులో ఉన్నారు. మొకాల కుర్వు నుంచి కొద్దిదూరం రోడ్డు సరిచేశాం. ఆలయ కమి టీ నుంచి 11రోజులు జాతర కోసం అనుమతి అ డిగాం.. కానీ మూడ్రోజులు మాత్రమే ఇచ్చారు. పూజారుల కోసం అన్నదానం ఏర్పాటు చేస్తాం.
– గురువయ్య, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి