వనపర్తి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : రైతులను నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ఈనెల 29న వనపర్తిలో రైతులతో సమరభేరీ మోగిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. మం గళవారం వనపర్తిలో సింగిరెడ్డి నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉన్న సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వలేమని మంత్రులు చెప్పడం సిగ్గుచేటని, కర్షకులకు అండ గా నిలవాల్సింది పోయి వారికిచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తీవ్ర ఆవేదనలో ఉన్న రైతుల పక్షాన బాధ్యతగల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైందని తెలిపారు. ప్రతి మహిళకు రూ.2,500, యువతులకు స్కూ టీలు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి సాయంతోపాటు తులం బంగారం, రూ.4వేల ఆసరా పింఛన్లు తదితర హామీల అమలుకు ప్రతిఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధ్దానాలను ఎండగట్టేందుకు రైతు సమరభేరికి ప్రజలను సమీకరించాలని కోరారు.
వనపర్తిలో జరుగుతున్న రైతుల సమరభేరీ సదస్సుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అథితిగా పాల్గొంటారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సింగిరెడ్డికి ఫోన్ చేసి నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. రోడ్ల విస్తరణ, మత్స్య కళాశాల, జేఎన్టీయూ కళాశాల, ఐటీ టవర్ వంటి గొప్ప అభివృద్ధి పనులను నిరంజన్‌రెడ్డి సాధించగలిగారని హరీశ్‌రావు గుర్తు చేశారు. సమరభేరి ద్వారా రేవంత్‌రెడ్డి మెడలు వంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా సమరభేరీ సదస్సు నిర్వహించుకుందామనివివరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధ ర్, నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్, రమేశ్ గౌడ్, కృష్ణయ్య, కృష్ణానాయక్, లక్ష్మారెడ్డి, సామ్య నా యక్, వెంకటేశ్, జగన్నాథం, జాత్రూ నాయక్, నాగన్న యాదవ్, కృష్ణ, తిరుమల్, అశోక్, రవి, రహీం, గులాం ఖాదర్, గిరి, రాము, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.