మానవపాడు, ఏప్రిల్ 20 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేతలు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత అరకొరగా కొందరి రైతుల రుణాలే మాఫీ చేసి మమ అనిపి ంచారు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కారు కనికరించి చేయకపోదా? అని ఎదురుచూస్తున్నా.. ఆశలు మా త్రం నిరాశగానే మిగిలాయి. మానవపాడు మండలంలో ఇ ప్పటి వరకు 450 మంది రైతులకు రుణమాఫీ కాలేదు.
అసలు రుణమాఫీ జరుగుతుందా? లేదా? అ న్న సందేహంలో రైతులు కొట్టుమిట్టాడుతు న్నారు. మండలంలో మొత్తం 5,356 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకు న్నారు. వీరిలో 450 మందికి వివిధ కారణాలతో రుణమాఫీ కాలేదు. టెక్నికల్ ప్రాబ్లం, ప్రభుత్వ ఉద్యో గాలు, కుటుంబీకులు నిర్ధారణ కాని వారు, ఖాతా క్లోజ్ చేసిన వారు.. ఇలా పెండింగ్లో ఉండిపోయారు. బ్యాంకులకు వెళ్తే మీకు మాఫీ కాదు.. వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం మొదలుకొని కమిషనరేట్ వరకు వెళ్లినా రుణమాఫీ కాలేదని వాపోయారు.