మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 3 : భవిష్యత్‌లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్‌డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, సిటీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య పటిష్టమైన రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నా రు. కార్గోతో ఆర్టీసీ ఆదాయం మరింత పెరిగిందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇతర ఉద్యోగుల మాదిరి భరోసా కల్పించే విషయమై సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ అధిగమించేందుకు తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సురక్షిత ప్ర యాణానికి ఆర్టీసీ నిదర్శనమని చెప్పారు.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దని, బస్సుల్లోనే వెళ్లాలని సూచించారు. నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్టీసీలో అ ధునాతన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఏర్పాటైందన్నారు. జిల్లాలో ఆర్టీసీని పటిష్టం చేస్తామన్నారు. అనంతరం బస్టాండ్‌లో స్టాల్స్‌ను పరిశీలించి ప్రయాణికులతో మంత్రి మాట్లాడారు. చిన్నారులను పలుకరించి వారికి స్నాక్స్ ఇప్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డీఎం సుజాత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, ఆర్టీవో నరేశ్, డీఎస్పీ మహేశ్, ఆర్టీసీ నా యకులు జీఎల్ గౌడ్, చారి, కొండయ్య, బసప్ప, సాయిరెడ్డి, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి..
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 3 : సీసీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. మంగళవారం పురపాలిక ఆవరణలో వేసిన సీసీ రోడ్డును మంత్రి పరిశీలించారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు నాణ్యతగా పనులు చేపట్టాలన్నారు. అనంతరం మున్సిపల్ టౌన్హాల్లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ గీతాలు, జానపదం, దేశభక్తి, భజన, తెలంగాణ సాంస్కృతిక పోటీల్లో పా ల్గొన్న కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, కళాకారులు అశోకాచారి, బాల్‌చందర్, శివన్న, గోపా ల్, వెంకటేశ్, సీతారామాచారి, రాములు, తిరుపతిరెడ్డి, నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.