గద్వాల/అలంపూర్/ఉండవెల్లి, ఏప్రిల్ 23 : నడిగ డ్డ పౌరుషాన్ని మరోసారి చాటాల్సిన అవసరం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీ మొండివారని.. వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జి ల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినా.. గద్వాల, అలంపూర్ నుంచి రెండు సీట్లు గెలిచి నడిగడ్డ పౌరుషం, మొండితనాన్ని చాటి చెప్పారన్నారు. ఇదే తరహాలో మ రోసారి నడిగడ్డ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అధిక మెజార్టీతో పార్లమెంట్‌కు పంపాలని కోరారు. ప్రజలు భవిష్యత్‌ను ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించా రు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అ ధ్యక్షతన వహించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్య ర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలి సి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. రా బోయే ఎంపీ ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్కు వస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంటుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపిద్దామన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా.. పదేండ్ల కేసీఆర్ పాలన చూసి ఓటేస్తారో.. పూటకో అబద్ధం చెప్పే కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తారో ప్ర జలే తేల్చువాలన్నారు. వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానా లు గెలువగా.. 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది మంత్రులు, ఎంపీలు, డిప్యూటీ సీఎం పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జారుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెసోళ్లు పదవుల ఆశ చూ పినా బీఆర్ఎస్కు అండగా నిలిచారన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకులు సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెడుతుంటే.. కవితను మోదీ జైళ్లో పెట్టించారన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేస్తే వాటిని ఆర్ఎస్పీ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రస్తుతం బాహుబలి పార్ట్-1, పార్ట్-2 లాగా రేవంత్ హామీలు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్పా మరేదీ నెరవేర్చలేదన్నారు. పా ర్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ పార్ట్ -2 హామీలు ఇస్తున్నారని, వాటి కోసం దేవుళ్లను సాక్షులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. రైతుబంధు ఇవ్వలేనోడివి.. ఆగస్టు నాటికి రూ.40వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని ఒ కసారి మోసపోవచ్చు కానీ.. రెండోసారి కూడా నమ్మి మోసపోతే తప్పు ప్రజలదేనన్నారు. రేవంత్‌రెడ్డి మోసాలనే అస్ర్తాలుగా చేసుకొని ఎంపీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన తీరు చూస్తే మేం మోసం చేస్తాం.. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే రీతిలో ఉన్నదన్నారు.
నిజాయితీ అయిన మోసగాడు రేవంత్‌రెడ్డి అని కితాబిచ్చారు. 420 హామీలతో రేవంత్ గద్దెనెక్కాడన్నారు. లంకెబిందెలుంటాయి.. దోచుకెళ్దామని వస్తే అన్నీ ఖాళీ బిందెలే ఉన్నాయని రేవంత్ నిరాశ చెందాడన్నారు. సీఎం దొంగలాగ జేబులో కత్తెర పెట్టుకొని ఎప్పుడు ఎవరి జేబు కట్ చేయాలని ఆలోచిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లో ప్రచారానికి వచ్చిన సమయంలో తెలంగాణ తెచ్చిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసీఆర్‌ను నానా బూతులు మాట్లాడాడని.. కేసీఆర్ మగాడైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవాలని సవాలు వి సిరిన సందర్భాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. “సీఎంకు నే ను సవాలు విసురుతున్నా.. నీవు మగాడివైతే.. రైతుబం ధు ఇవ్వు, నీవు మగాడివైతే.. రూ.40వేల కోట్ల రుణమాఫీ చెయ్.. నీవు మగాడివైతే.. ఆసరా పింఛన్లు పెంచి వారికి చేయూతనివ్వు, నీవు మగాడివైతే.. మహిళలకు నెలకు రూ.2,500ల హామీ అమలు చెయ్.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడు..’ అని హితవు పలికారు. దేవుళ్ల సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరుకు వలసొచ్చినోళ్లు ఏనాడూ సాగు, తాగునీటికి ఇబ్బందు లు పడలేదు. రైతుబంధు, ఉచిత కరెంట్ సరఫరాలో ఎ లాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుబంధు డబ్బులు పడ్డాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం 30వేల ఉద్యోగాల కు నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ ఇస్తే.. 100 రోజుల్లో మేం ఉద్యోగాలిచ్చామని రేవంత్ అండ్ కో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. మోదీ తెలంగాణకు ఏం చేశాడని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కాని నవోదయ, సైనిక పాఠశాల మం జూరు చేశాడా అని ప్రశ్నించారు.
తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మోదీ రాముడిని చూపి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. దేశవ్యాప్తంగా మోదీ అంక్షింతలు పంపిణీ చేస్తే.. ఈ పదేళ్లలో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్డాడని.. కేసీఆర్ ప్రభుత్వం మూడున్నర కోట్ల ధాన్యాన్ని దేశానికి ఇవ్వడమే అందు కు ఉదాహరణన్నారు. ఇదంతా కేసీఆర్ ఘనతనేనని కొనియాడారు. మనమందరం హిందువులం.. అందరు దే వుళ్లను పూజిస్తామన్నారు. పేదల జనధన్ ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి ఒక్కరికైనా వేశాడా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని పదేండ్లుగా అడుగుతున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు.. ఎక్కడిచ్చారో చూపెట్టాలని డి మాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ నల్లచట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు కొ మ్ము కాస్తూ రైతుల కష్టాలను రెట్టింపు చేశాడని విమర్శించారు. పేదలకు ఎల్లప్పుడు గులాబీ జెండా అండగా ఉంటుందన్నారు. ప్రవీణ్‌కుమార్ సమర్థవంతమైన వ్య క్తి అని.. అతడిని గెలిపిస్తే నడిగడ్డ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కాదు.. బీఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, వి జయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీలు దేవర మల్లప్ప, అభిలాశ్ రావు, బైకని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లాకు విజయుడు ఎడమ భుజమైతే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కుడి భుజంగా ఉంటాడు. నడిగడ్డ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన అభిమానాన్ని ఎంపీ ఎన్నికల్లోనూ చూపుతారని ఆశిస్తున్నా.. అలంపూర్ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కు పంపితే మొట్టమొదటగా శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి గానూ పురావస్తు శాఖలో నిబంధనల సడలింపునకు కృషి చేస్తాడు. అధికార పార్టీకి దమ్ముంటే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్‌ను పూర్తి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని విధాలా సమర్థుడైన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అవకాశం ఇవ్వాలి.
సమాజంలో ఎంతో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చే సేందుకే పాలిటిక్స్‌లోకి వచ్చాను. రాజకీయ హోదా, అధికారం కోసం రాలేదు. ప్రజా గొంతుకను పార్లమెంట్లో వినిపించడానికే ఎ న్నికల్లో నిల్చున్నా.. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యాలయాల కా ర్యదర్శిగా వేలమంది విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీకారం చు ట్టా.. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం ఉచితంగా అం దించాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. తెలంగాణను ప్ర పంచపటంలో నిలిపేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. నాపై నమ్మకముంచి పార్లమెంట్లో మీ తరఫున ప్రశ్నించే అవకాశం ఇవ్వండి. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడితోపాటు రాబోయే రోజుల్లో నేను కూడా సమస్యల్లో పాలుపంచుకుంటాను.
అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆదరించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నడిగడ్డ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ.. అందరూ ఒకే పార్టీ వారైతే ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకోవచ్చు. ప్రతిభావంతుడు, విద్యావంతుడైన ఆర్ఎస్పీ లాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే మన నిధులు మనం తెచ్చుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎలాంటి పనులైనా కొట్లాడి సాధించుకోవచ్చు. ప్రశ్నించే గొంతుకకు అవకాశమివ్వండి.
అనుకున్న సమయానికంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు క ష్టాలు మొదలయ్యాయి. గతంలో మాదిరి అన్ని పథకాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వమే కలకాలం అధికారంలో ఉం టుంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పటికే హస్తం నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రజలు కారు గుర్తుపై ఓటేసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్లమెంటుకు పంపితే కాంగ్రెస్ నాయకుల్లో మరింత భయం పుట్టుకొస్తుంది. ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఉంటే మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది.