వనపర్తి,జూన్ 18(నమస్తే తెలంగాణ) : ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ అంతరాయంతో విసిగివేసారిన ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాక మధ్యలో అసెంబ్లీ ఎన్నికలతో బ్రేక్ పడింది. ఇక అంతే.. చేపట్టిన రోడ్ల విస్తరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం విస్తరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికలకు ముందు ఉరుకు లు, పరుగులపై కొనసాగిన రోడ్ల విస్తరణ అనంతరం విరామం అన్నట్లుగానే కనిపిస్తున్నది. అ సంపూర్తి పనులు, అసౌకర్యాల రోడ్లతో జిల్లా కేంద్రంలో రాకపోకలు అస్తవ్యస్తంగా మారా యి. జిల్లా కేంద్ర వాసులు ఏళ్లుగా ఎదురు చూసిన రోడ్ల విస్తరణ ఆశలపై మేఘాలు కమ్ముకున్నట్లుగా నిలిచిన పనులు దర్పణం పడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. గత ప్రభుత్వంలోనే మెజార్టీ విస్తరణ పనులు జరిగాయి. ఇక కొద్దిమేర మాత్రమే విస్తరణ మిగిలింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పనుల ఊసేలేదు. ప్రసంగాలు తప్పా పనులు ఎక్కడా లేవన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లెవెత్తుతున్నాయి. కొత్త పనుల సంగతి అటుంచితే.. అర్థాంతరంగా ఆ గిన పనులను సహితం రెండేళ్లవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యవేక్షణలో అత్యంత వేగంగా రోడ్డు విస్తరణ ప నులు చేపట్టడాన్ని సాహసోపేత నిర్ణయమని ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి పలు దఫాలుగా పట్టణ రోడ్ల విస్తరణపై సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5సమీక్షలను ఏర్పాటు చేసినా అం గుళం కూడా విస్తరణకు నోచుకోలేదు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే కూడా రోడ్ల విస్తరణను పూర్తి చేయిస్తామంటూ పలు సందర్భాల్లో వెల్లడించినా ఎక్కడ వేసి న గొంగళి అక్కడే అన్న చందాన పనులు కనిపిస్తున్నా యి. వరుస సమీక్షలు తప్పా ఒరిగిందేమీ లేదన్నట్లు రోడ్ల విస్తరణ పనులపై పట్టణ ప్రజలు విసుగు చెందుతున్నారు. ఎవరిని కదిలించినా ఏమున్నది రెండేళ్లవుతున్నాయన్న ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. నాలుగు రోడ్ల పనుల్లో మూడు రోడ్ల పనులు ఇంచుమించు పూర్తయ్యాయి. ప్రతి సమీక్షలోనూ మున్సిపల్ అధికారులకు మిగిలిన విస్తరణపై కలెక్టర్ దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు.
పెబ్బేరు రోడ్డులో కిలోమీటరు మేర రోడ్డు పనులు చేపట్టాల్సి ఉన్నది. కాగా, పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నది. కేవలం డ్రైనేజీ కోసం కొంతమేర నిర్మాణాలు తొలగించినా డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. మరికొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలను యజమానులే తొలగించుకోగా, ఇంకొన్ని అలాగే ఉన్నాయి. ఇక వీటితోనే విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇంకా ఇండ్ల తొలగిం పు, విద్యుత్ స్తంభాలను తీసివేయడం, డ్రైనేజీని పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం వల్ల పెబ్బేరు రోడ్డు విస్తరణ పనులన్నీ మొదలు కాలేదన్న అభిప్రాయం ఉన్నది. ఇదిలా ఉంటే, రెండేళ్లుగా విస్తరణపై ఎలాంటి చలనం లేనందునా ఇక మూలకు పడ్డట్లే అన్నట్లు షాపులు, ఇండ్ల యజమానులు మళ్లీ యథావిధిగా నిర్మాణాలను సవరించుకుంటే, మరికొన్ని మధ్యలోనే నిలిచాయి. డ్రైనేజీల కోసం కాల్వలు తవ్వి వదిలేయడం, నిర్మాణాలు చేపట్టకపోవడంతో విధిలేని పరిస్థితిలో సొం తంగా పైపులు వేసుకున్నారు.
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణను రూ.49.7కోట్ల అంచనాతో చేపట్టారు. నాలుగు రోడ్లకు కలిపి 6కిలోమీటర్ల పొడవు, మరో 3 బ్రిడ్జిల నిర్మాణాలను ఈ బడ్జెట్లో రూపొందించారు. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ పనులను నాలుగు విభాగాలుగా చేపట్టారు. వీటిలో చిట్యాల రోడ్డు, గోపాల్పేట, పాన్‌గల్, పెబ్బేరు రోడ్డు ఉన్నాయి. వీటిలో చిట్యాల, గోపాల్పేట రోడ్డు పనులు మెజార్టీగా జరిగాయి. గోపాల్పేట రోడ్డు వైపు విస్తరణలో మూడు కిలోమీటర్ల రోడ్డుంటే, 2.85 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేశారు. మరో రెండు బ్రిడ్జీలు కూడా నిర్మించారు. చిట్యాల రోడ్డు పనుల వారీగా చూస్తే.. ఇందులోనూ 3 కిలోమీటర్ల రోడ్డుకు గానూ దాదాపు ఏర్పాటు చేశారు. డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ స్థంభాల తొలగింపులాంటివన్నీ ఎన్నికలకు ముందే చేపట్టారు. చింతల హనుమాన్ ఆలయ సమీపంలో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టారు. ఇక పాన్‌గల్ రోడ్డు విస్తరణ పనులను చూస్తే.. ఇక్కడ కిలోమీటరు వరకు రోడ్డు వేయాల్సి ఉండగా, కేవలం 400 మీటర్లు మాత్రమే వేశారు. ఇంకా ఇండ్లు తొలగించడం, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్ స్తంభాల తొలగింపులాంటివన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం 30శాతం పనులు జరిగినట్లు అంచనా ఉన్నది.