సామాన్యులపై భారం మోపుతున్న ప్రభుత్వాలు
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
- మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వెల్దండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
వెల్దండ, మే 16 : సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు భారీగా నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై యుగంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. అంతకుముందు వెల్దండలో ఆయన మొక్కజొన్న కొనుకోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్టారాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి, నాయకులు యాదగిరి, జోగయ్య, గండికోట రాజు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హన్వాడలో రాస్తారోకో
హన్వాడ, మే 16 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తు శనివారం మండల కేంద్రంలో చించోలి- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు విండో చైర్మన్ కృష్ణయ్యగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి ఎన్నికలు అయిన వెంటనే రేట్లు పెంచడం సిగ్గు చేటన్నారు. కేంద్రం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ లక్ష్మయ్య, బాలరాజు, జంబులయ్య, శ్రీనివాసులు, చెన్నయ్య, హరిచందర్, నరేందర్, వెంకన్న, బసిరెడ్డి, మాధవులు, రాములు, శివకూమార్, శ్రీను, తేజశేఖర్, మోహన్, ఖాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Diesel Prices
- Petrol
- Protest
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

